విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ అక్టోబర్ 20న ట్రైలర్ లాంచ్

Must Read

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ ‘మెకానిక్ రాకీ’తో అలరించడానికి రెడీగా వున్నారు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్నారు. 

మేకర్స్ ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ నెల 20న ట్రైలర్ లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ఇంట్రస్టింగ్ టీజర్‌తో చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. జేక్స్ బిజోయ్ కంపోజ్ చేసిన మొదటి రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మనోజ్ కటసాని డీవోపీ గా పనిచేస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్.

మెకానిక్ రాకీ నవంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.  

తారాగణం: విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి

నిర్మాత: రామ్ తాళ్లూరి

ప్రొడక్షన్ బ్యానర్: SRT ఎంటర్‌టైన్‌మెంట్స్

సంగీతం: జేక్స్ బిజోయ్

డీవోపీ: మనోజ్ కటసాని

ప్రొడక్షన్ డిజైనర్: క్రాంతి ప్రియం

ఎడిటర్: అన్వర్ అలీ

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సత్యం రాజేష్, విద్యాసాగర్ జె

పీఆర్వో: వంశీ-శేఖర్

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News