‘మత్తు వదలారా 2’ వింసికల్ యూనివర్స్ పరిచయం, సెప్టెంబర్ 13న రిలీజ్

Must Read

అందరి ప్రసంశలు అందుకొని ‘మత్తు వదలరా’ మూవీ సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు, అదే క్రియేటివ్ టీమ్ ‘మత్తు వదలారా 2’  సీక్వెల్‌తో వస్తున్నారు. శ్రీ సింహ కోడూరి అతని లీడ్ రోల్ లో నటిస్తున్నారు, సత్య అతని స్నేహితుడిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ అనౌన్స్ మెంట్ ఈరోజు శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని రెండు పోస్టర్ల ద్వారా వింసికల్ యూనివర్స్ ని పరిచయం చేసింది.

ఫస్ట్-లుక్ పోస్టర్‌లో శ్రీ సింహ, సత్య డైనమిక్ పోజులలో, వారి ప్రత్యర్థులపై గన్స్ ని ఫైర్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక బిల్డింగ్ పై H.E  టీం(హై ఎమర్జెన్సీ టీమ్) అని రాసుంది. ఈ సీక్వెల్ దాని ప్రీక్వెల్ కంటే మరింత ఎక్సయిటింగ్ గా ఉంటుందని పోస్టర్ సూచిస్తుంది. సీక్వెల్‌లో క్రైమ్ ఎలిమెంట్‌లను సూచించే మరో పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు.

పార్ట్ 1 లో డెలివరీ ఏజెంట్లు బాబు (శ్రీసింహ), యేసు (సత్య) ఈసారి స్పెషల్ ఏజెంట్లు గా కనిపిస్తున్నారు. ఈ స్పెషల్ ఏజెంట్లు స్పెషల్ టాస్క్‌లు, ట్విస్ట్ లు, ఎంటర్ టైన్మెంట్ ని ప్రామిస్ చేస్తున్నారు.

ఈ వింసికల్ సీక్వెల్ యూనివర్స్ లో ఫారియా అబ్దుల్లా చేరారు. సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.   ప్రతి పాత్ర కీలకంగా ఉండబోతోంది. ప్రముఖ నటులు చేరడంతో ఎంటర్ టైన్మెంట్ నెక్స్ట్ లెవల్ లో వుండబోతోంది,

ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తుండగా, సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.

మత్తు వదలారా 2 చిత్రాన్ని సెప్టెంబర్ 13న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

తారాగణం: శ్రీ సింహ కోడూరి, సత్య, ఫరియా అబ్దుల్లా, సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్.

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రితేష్ రానా
బ్యానర్లు: క్లాప్ ఎంటర్టైన్మెంట్ & మైత్రి మూవీ మేకర్స్
నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ) & హేమలత
సంగీతం: కాల భైరవ
డిఓపి: సురేష్ సారంగం
సహ రచయిత: తేజ ఆర్
Asst. రైటర్: సాయి సోమయాజులు
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్: నార్ని శ్రీనివాస్
యాక్షన్ కొరియోగ్రఫీ: వింగ్‌చున్ అంజి
లిరిసిస్ట్: ఫరియా అబ్దుల్లా
Vfx సూపర్‌వైజర్: జూలూరి అనిల్ కుమార్
మోషన్ గ్రాఫిక్స్/విజువల్ ఎఫెక్ట్స్: ARK WRX
స్టిల్స్: నిఖిల్ YHS
పబ్లిసిటీ డిజైన్స్: శ్యామ్ పాలపర్తి
మేకప్ చీఫ్: కొండా రమేష్
మార్కెటింగ్: ఫస్ట్ షో
పబ్లిసిటీ: బాబా సాయి కుమార్ మామిడిపల్లి
పీఆర్వో: వంశీ – శేఖర్
కాస్ట్యూమ్ డిజైనర్: తేజ ఆర్

Latest News

Nuvvu Gudhithe lyrical song from Drinker Sai

Dharma and Aishwarya Sharma play the lead roles in Drinker Sai, which carries the tagline Brand of Bad Boys....

More News