గొప్ప సందేశాన్నిచ్చే మూవీ “మాస్టర్ సంకల్ప్” ట్రైలర్ లాంఛ్

పలు ప్రతిష్టాత్మక అవార్డ్ లు పొందిన చిల్డ్రన్ ఫిలింస్ రూపొందించి దర్శక నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు డా. భీమగాని సుధాకర్ గౌడ్. ఆయన శ్రీ లక్ష్మి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలింస్ బ్యానర్స్ పై ఆదిత్య, క్రియేటివ్ జీనియస్, విక్కీస్ డ్రీమ్, డాక్టర్ గౌతమ్, అభినవ్ వంటి బాలల చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. తమ ప్రొడక్షన్ లో ఆరవ చిత్రంగా మాస్టర్ సంకల్ప్ ను మన ముందుకు తీసుకొస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ప్రముఖ నటులు శివాజీ రాజా మాస్టర్ సంకల్ప్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత డా. భీమగాని సుధాకర్ గౌడ్, శ్రీ మిత్ర చౌదరి, పెంచల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా

నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ – పిల్లలు బాగుంటేనే సమాజం బాగుంటుంది. బాలల కోసం నిస్వార్థంగా సినిమాలు రూపొందిస్తున్న డా. భీమగాని సుధాకర్ గౌడ్ అభినందనీయులు. వ్యాపారమయమైన ఇండస్ట్రీలో పిల్లల కోసం సినిమాలు చేస్తున్న ఆయన గొప్ప మనసును మనమంతా ప్రశంసించాలి. మాస్టర్ సంకల్ప్ ట్రైలర్ ను నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. పిల్లల్లో మానసిక రుగ్మతలను ఎలా పోగొట్టాలి అనే అంశాన్ని ఈ చిత్రంలో ఎంతో ఆసక్తికరంగా, మనసును కదిలించేలా సుధాకర్ గౌడ్ గారు తెరక్కించారు అన్నారు.

శ్రీ మిత్ర చౌదరి మాట్లాడుతూ – ఫిలింమేకర్ గా సుధాకర్ గౌడ్ గారు కమర్షియల్ సినిమాలు చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ ఆయన ఒక విద్యావేత్తగా బాలలను దగ్గరగా చూసిన అనుభవంతో వారు అన్ని విధాలా అభివృద్ధి చెందాలని, మంచి పౌరులుగా ఎదగాలని సినిమాల ద్వారా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన చేసిన చిల్డ్రన్ ఫిలింస్ ఒక్కోటి ఒక్కో ఆణిముత్యంలా ప్రేక్షకుల మెప్పుతో పాటు ప్రతిష్టాత్మక అవార్డ్స్ పొందాయి. ఈ మాస్టర్ సంకల్ప్ సినిమా కూడా సుధాకర్ గౌడ్ గారికి మంచి పేరు తీసుకురావాలి. ఈ సినిమా చేయడం వెనక ఆయన ఉద్దేశం నెరవేరాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు.

పెంచల్ రెడ్డి మాట్లాడుతూ – సుధాకర్ గౌడ్ గారు గతంలో ఆదిత్య, క్రియేటివ్ జీనియస్, విక్కీస్ డ్రీమ్, డాక్టర్ గౌతమ్, అభినవ్ వంటి బాలల చిత్రాలను మనకు అందించారు. ఆయన చేస్తున్న ఆరవ బాలల చిత్రం మాస్టర్ సంకల్ప్ ట్రైలర్ చాలా బాగుంది. యోగ, ధ్యానం వంటి మన ప్రాచీన సాధన మార్గాల ద్వారా పిల్లల్లో మానసిక రుగ్మతలను ఎలా తొలగించవచ్చో ఈ చిత్రం ద్వారా సుధాకర్ గౌడ్ గారు చక్కగా చూపించారు. అన్నారు.

దర్శక నిర్మాత డా. భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ – మాస్టర్ సంకల్ప్ చిత్ర ట్రైలర్ రిలీజ్ కు వచ్చిన అతిథులు అందరికీ కృతజ్ఞతలు. ఈ రోజు పిల్లల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. అనేక సర్వేల ద్వారా మనం విస్తుపోయే వాస్తవాలు తెలుస్తున్నాయి. బాలల్లో పరీక్షలు, కుటుంబ వాతావరణం, మొబైల్ వాడకం, పెరిగిన సామాజిక నేపథ్యం ఇవన్నీ ఒత్తిడికి కారణాలుగా మారుతున్నాయి. పిల్లల్లో మానసిక రుగ్మతలు తొలగించేందుకు మన పూర్వీకులు చెప్పిన యోగ, ధ్యానం చక్కటి మార్గాలు. కానీ వాటిపై తల్లిదండ్రులకు అవగాహన లేదు. పిల్లలు యోగా, ధ్యానం చేసేలా పేరెంట్స్ ప్రోత్సహించాలి. పిల్లలు శారీరకంగానే కాదు మానసికంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే సందేశాన్నిస్తూ మాస్టర్ సంకల్ప్ సినిమాను రూపొందించాను. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలో విడుదలకు సిద్ధం చేస్తున్నాం అన్నారు.

TFJA

Recent Posts

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…

6 days ago

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

1 week ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

2 weeks ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

2 weeks ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

2 weeks ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

2 weeks ago