కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం – నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి
పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధా రెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి రచనా, స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘దేవగుడి’. ఈ చిత్రానికి లక్ష్మీకాంత్ కనికే డిఓపిగా పని చేస్తుండగా షేక్ మదీన్, రఘు కుంచె సంగీతాన్ని అందించారు. నాగిరెడ్డి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించారు. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రలు పోషించగా పలువురు నటీనటులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదల చేశారు.
టీజర్ విడుదల అనంతరం హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘2013లో రామకృష్ణా రెడ్డి నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఎంతో ప్యాషన్‌తో ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా సినిమాలు నిర్మించి సక్సెస్ అయ్యారు. అప్పట్లో ఆయన సినిమా గురించి చెబుతుంటే.. మీరే డైరెక్షన్ చేయవచ్చు కదా అని అనేవాడిని. మరి నేను అప్పుడు అలా అన్నాననో, లేకపోతే.. ఫస్ట్ ఫిల్మ్ దగ్గరుండి అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత తీసుకున్న నిర్ణయమో తెలియదు కానీ, వెంటనే డైరెక్టర్‌గా మారారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న ఈ ‘దేవగుడి’ చిత్రం మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ‘దేవగుడి’ టైటిల్ చాలా బాగుంది. టీజర్ కూడా అద్భుతంగా ఉంది. ఇందులో చిత్రమ్మగారు పాడిన మెలోడీ సాంగ్ చాలా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఆ సాంగ్ నా మదిని తాకింది. ఇది ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రియల్‌గా జరిగిన స్టోరీ అని నేను అనుకుంటున్నాను. అనుకోవడం కాదు.. నాకు ఈ స్టోరీ తెలుసు. రియల్‌గా జరిగిన స్టోరీ ఇది. కచ్చితంగా అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో నటించిన హీరోహీరోయిన్లకు నేను చెప్పేది ఒక్కటే. అందరూ కష్టపడే ఇక్కడ వరకు వస్తారు. ఇక్కడకు వచ్చిన తర్వాత కూడా అంతే కష్టపడాలి. సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి కామన్. కానీ డిజప్పాయింట్ అవకుండా ముందుకు వెళుతూనే ఉండాలి. క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్. దర్శకనిర్మాత రామకృష్ణా రెడ్డి సినిమా సక్సెస్‌పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ మధ్య మనం చూస్తున్నాం.. కంటెంట్ బాగుంటే.. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమాను కూడా ఆదరిస్తారని, ఆదరించాలని కోరుకుంటున్నాను. మా రామకృష్ణా రెడ్డికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. ఇలాంటి వాళ్లు సక్సెస్ అయితే.. ముందు ముందు చాలా మంచి సినిమాలు వస్తాయి. ఆయనకున్న ప్యాషన్ ఏంటనేది నాకు తెలుసు. రఘు విషయానికి వస్తే.. మేమంతా ఒకేసారి స్టార్ట్ అయినవాళ్లం. తను సంగీతంతోనే కాదు, ఆర్టిస్ట్‌గానూ మంచి మంచి పాత్రలు చేస్తున్నారు. డిసెంబర్ 19న థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రాన్ని అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను’’ అని అన్నారు.
దర్శకనిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ఈ వేడుకకు వచ్చిన మీడియా మిత్రులకు, బంధుమిత్రులకు ధన్యవాదాలు. 2013లో శ్రీకాంత్‌గారితో పుష్యమి ఫిలిం మేకర్స్ శ్రీకారం చుట్టాము. శ్రీకాంత్‌గారు ఏ నోటితో అన్నారో ఆ రోజు.. ‘భయ్యా నువ్వు డైరెక్టర్ అయిపోవచ్చుగా అని’.. ఆ తర్వాత నేను డైరెక్టర్‌గా మారాను. ‘దృశ్యకావ్యం’ చేశాను. అప్పుడు కూడా ఆయన అభినందించారు. ఇప్పుడు మళ్లీ మా ‘దేవగుడి’ కోసం వచ్చారు. డిసెంబర్ 19న ‘దేవగుడి’ ఫైర్ ఉంటుంది. కచ్చితంగా హిట్ కొట్టబోతున్నాం. చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను. ఎందుకంటే, ఈ సినిమాకు టాలెంటెడ్ పర్సన్స్ ఎందరో వర్క్ చేశారు. ఆల్రెడీ ఈ సినిమాను నిపుణులు, సెన్సార్ మెంబర్స్ అందరూ చూసి.. ఎంతగానో మెచ్చుకున్నారు. కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నాను. స్క్రీన్‌ప్లే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఎంటైర్ టీమ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా చేశాం. రఘు కుంచెగారు అద్భుతమైన పాత్ర చేశారు. ఆయన ఎంతగానో సహకరించారు. డీఓపీ నాకు మిత్రుడు. ఆయనే కాదు, ఎంటైర్ టీమ్ అంతా మన సినిమా అనుకుని వర్క్ చేశారు. ఇందులో నటించిన చిన్న పిల్లలు కూడా ఎంతో బాగా చేశారు. వాళ్ల తల్లిదండ్రుల సహకారం మరిచిపోలేను. శ్రీకాంత్‌గారికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ.. ప్రేక్షకులను ఈ సినిమా ఎంతగానో మెప్పిస్తుందని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను’’ అని తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో రఘు కుంచె, డీఓపీ లక్ష్మీకాంత్ కనికే, హీరోహీరోయిన్లు మాట్లాడుతూ.. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ.. సినిమాను ప్రేక్షకులు సక్సెస్ చేయాలని కోరారు.
అభినవ శౌర్య, నరసింహ, అను శ్రీ, రఘు బాబు, అన్నపూర్ణమ్మ, రఘు కుంచె, రాకెట్ రాఘవ, ఆర్ఎక్స్ 100 లక్ష్మణ్, ఇమ్మానియేల్, ప్రభావతి, రాజశ్రీ నాయర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
రచన, దర్శకత్వం, నిర్మాత: బెల్లం రామకృష్ణా రెడ్డి
సంగీతం: ఎస్, కె మదీన్ అండ్ రఘు కుంచె
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రవీణ్ రెడ్డి అబ్బవరం
డిఓపి: లక్ష్మీకాంత్ కనికే
ఎడిటర్: వి. నాగిరెడ్డి
పిఆర్ఓ: బి. వీరబాబు
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…