టాలీవుడ్

‘టైగర్ నాగేశ్వరరావు’ అక్టోబర్ 20 న విడుదల

పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్‌లను అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, దేశవ్యాప్తంగా పేరున్న మాస్ మహారాజా రవితేజ  టైటిల్ రోల్ లో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’తో వస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరాకు అక్టోబర్ 20న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే సినిమా ఆలస్యమయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో టైగర్ నాగేశ్వరరావు విడుదలలో ఎలాంటి జాప్యం లేదని స్పష్టం చేస్తూ మేకర్స్ ఓ అనౌన్స్ మెంట్  విడుదల చేశారు.

‘టైగర్‌నాగేశ్వరరావు అక్టోబర్ 20న విడుదల కావడం లేదని నిరాధారమైన ఊహాగానాలు వచ్చాయి. కొన్ని శక్తులు ఈ రూమర్స్ ని  వ్యాప్తి చేస్తున్నాయి. ఎందుకంటే మా చిత్రం ప్రేక్షకుల నుంచి గొప్ప ఆసక్తిని సంపాదించింది. థియేట్రికల్ ఎకోసిస్టమ్‌లోని వివిధ స్టేక్ హోల్డర్స్ నుంచి మొదటి ప్రాధాన్యత పొందింది. ఎలాంటి వదంతులను నమ్మవద్దు. మీకు అత్యుత్తమ సినిమా అనుభూతిని అందించడానికి మేము కృషి చేస్తున్నాము. అక్టోబరు 20 నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద టైగర్  వేట ప్రారంభమవుతుంది” అని మేకర్స్ తెలియజేశారు.

కొన్ని నెలల క్రితం రాజమండ్రిలోని ఐకానిక్ హేవ్‌లాక్ బ్రిడ్జ్ (గోదావరి)పై ఫస్ట్-లుక్ పోస్టర్ , కాన్సెప్ట్ వీడియోను లాంచ్ చేయడం ద్వారా మేకర్స్ సినిమా ప్రమోషన్‌లను  యూనిక్ స్టయిల్ లో  ప్రారంభించారు. త్వరలోనే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

దర్శకుడు వంశీ ఒక విన్నింగ్ స్క్రిప్ట్‌ని ఎంచుకుని, దానిని ఆకట్టుకునే రీతిలో ప్రజంట్ చేస్తున్నారు. ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్‌ మదీ ఐఎస్‌సి, సంగీతం జివి ప్రకాష్‌ కుమార్‌ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత.

ఈ సినిమాలో రవితేజకు జోడిగా  నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

నటీనటులు: రవితేజ, నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ తదితరులు

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: వంశీ
నిర్మాత: అభిషేక్ అగర్వాల్
బ్యానర్: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
సమర్పణ: తేజ్ నారాయణ్ అగర్వాల్
సహ నిర్మాత: మయాంక్ సింఘానియా
డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: ఆర్ మదీ
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

19 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

5 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

5 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago