విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సుమతి శతకం’. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుండి మంచి అభినందనలు లభించాయి. సుభాష్ ఆనంద్ సంగీతం పాటలకు మరింత ప్రాముఖ్యతను పెంచింది. రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికే ప్రమోషన్స్ టూర్ లో చక్కటి స్పందన తెచ్చుకుంది సుమతి శతకం చిత్ర బృందం. అలాగే తిరుపతిలోని ఒక కళాశాలలో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది.
సీరియల్స్ అలాగే బిగ్బాస్ ద్వారా ప్రతి ఇంట్లో ఒకరిగా అందరికీ పరిచయమైన అమర్దీప్ చౌదరి మాస్ మహారాజ్ రవితేజ అభిమాని అని అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రానికి సంబంధించిన కంటెంట్ చూసిన మాస్ మహారాజ్ రవితేజ గారు స్పందిస్తూ… “అమర్దీప్, నీ సినిమా సుమతీ శతకం చిత్ర టీజర్, ట్రైలర్ ఇంకా ఇతర కంటెంట్ చూడడం జరిగింది. నాకు బాగా నచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని, నీ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
కాలేజీలలో ప్రమోషన్లు చేస్తున్న సమయంలో హుక్ స్టెప్స్ విద్యార్థులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా టీజర్ ఇంకా ట్రైలర్ కు ప్రమోషన్స్ సమయంలో యువత నుండి ఆంధ్ర, తెలంగాణలో మంచి స్పందన లభించింది. చిత్ర టైటిల్ కూడా ప్రేక్షకులలో ఎంతగానో చొచ్చుకు పోయింది. సాధారణంగా జీరో కట్స్ తో సెన్సార్ కావడం అనేది చాలా అరుదైన విషయం, అటువంటిది ఈ చిత్రానికి జీరో కట్స్ తో యు/ఎ సర్టిఫికెట్ తో పాటు సెన్సార్ బోర్డు నుండి ప్రశంసలు రావడం మరొక ప్రత్యేకమైన విషయం. చాలా రోజులు తరువాత ఫీల్ గుడ్ సినిమాను చూస్తున్నామని సెన్సార్ వారు అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాలలో మైత్రి మూవీ మేకర్ ద్వారా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లోని నార్త్ అమెరికాలో వైబ్రంట్ సినిమాస్, అమెరికాలోని డల్లాస్ లో రవి కొల్లిపార, జై పాకాల విడుదల చేయనున్నారు.
నటీనటులు: అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి, టేస్టీ తేజ, మహేష్ విట్ట, JDV ప్రసాద్ తదితరులు.
సాంకేతిక వర్గం:
బ్యానర్: విజన్ మూవీ మేకర్స్
నిర్మాత: సాయి సుధాకర్ కొమ్మాలపాటి
రచన, దర్శకత్వం: ఎంఎం నాయుడు
సినిమాటోగ్రాఫర్: ఎస్ హలేష్
సంగీతం: సుభాష్ ఆనంద్
ఎడిటర్: నహిద్ మహమ్మద్
పిఆర్ఓ: మధు విఆర్
డిజిటల్ మార్కెటింగ్ : హౌస్ ఫుల్ మీడియా, డిజిటల్ దుకాణం
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…
సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…
"ఆటగదరా శివా" అంటూ శివతత్వాన్ని ఆవిష్కరించిన ప్రముఖ నటుడు - రచయిత- దర్శకుడు తనికెళ్ళ భరణి… సుప్రసిద్ధ మహిమాన్విత పుణ్యక్షేత్రం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అభిమానించే వారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు. ఆయన తెరపై కనిపించడమే అభిమానులకు…