వేలంటైన్స్ డే స్పెషల్ గా గ్రాండ్ గా రి రిలేజ్ అవుతున్న ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే

Must Read

ప్రముఖ నిర్మాత శ్రీ ఎమ్.ఎస్.రాజు తన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ” మనసంతా నువ్వే ” చిత్రం 2001 లో విడుదలై, అశేష తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొంది, రెండొందల యాభై రోజులు దిగ్విజయంగా ప్రదర్శించబడింది.
ఉదయ్ కిరణ్, రీమాసేన్, తనూరాయ్, ప్రధాన పాత్రలు పోషించిన ఈ సున్నితమైన ప్రేమకథా చిత్రానికి వీ.ఎన్.ఆదిత్య తొలిసారి దర్శకత్వం వహించారు.


పాతికేళ్ల తర్వాత ప్రైమ్ షో నిరంజన్ రెడ్డి, చైతన్యారెడ్డి, శ్రీ మాత క్రియేషన్స్ పై రఘురామ్ రెడ్డి, రవికాంత్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఈ నెల 14 వ తేదీన, వేలంటైన్స్ డే సందర్భంగా మరలా థియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నారు.ఈ జెనరేషన్ యూత్ కూడా ఈ చిత్రాన్ని బాగా ఆదరిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆర్పీ పట్నాయక్ సంగీత దర్శకత్వం చేసిన ఈ మ్యూజికల్ హిట్ చిత్రానికి సిరివెన్నెల గీత రచన, పరుచూరి బ్రదర్స్ రచన, సుచిత్రా చంద్రబోస్ కొరియోగ్రఫీ, ఎస్.గోపాల్ రెడ్డి ఛాయాగ్రహణం, రాజేష్ టచ్ రివర్ కళ అదనపు ఆకర్షణలు.


తెరమీద సునీల్, చంద్రమోహన్, తనికెళ్ల భరణి, పరుచూరి వేంకటేశ్వరరావు,
సిరివెన్నెల సీతారామశాస్త్రి, శివపార్వతి, సుధ, రజిత, శిరీష , కౌశల్, మాస్టర్ ఆనందవర్ధన్, బేబీ సుహానీ లిఖిత తమ పాత్రలకు జీవం పోశారు.

Latest News

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ “రుక్మిణి” టీజర్ లాంఛ్

నిరంజన్, గ్రీష్మ నేత్రికా , ప్రియ జస్పర్, దీప్తి శ్రీరంగం హీరో హీరోయిన్స్ గా జి సినిమా బ్యానర్ పై నేలబల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, కట్టా...

More News