మాళ్వి మల్హోత్రా స్పెషల్ సాంగ్ షాబానో విడుదల !!!

Must Read

ఆడు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై హీరోయిన్ మాళ్వి మల్హోత్రా నర్తించిన స్పెషల్ సాంగ్ ”షాబానో” డివో మ్యూజిక్ ద్వారా విడుదల అయ్యింది. గౌతమ్ చవాన్ నిర్మాతగా భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సాంగ్ కు యస్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేశారు.

సాంగ్ విడుదలైన తరువాత యువత నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. సోషల్ మీడియాలో సాంగ్ వైరల్ అవ్వడమే కాకుండా యంగ్ స్టర్స్ రీల్స్ చేస్తూ ఉండడం విశేషం. అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ సాంగ్ మెలోడిగా క్యాచ్చి లిరిక్స్ లో ఆకట్టుకుంటుంది.

టాలెంటెడ్ సింగర్ సాకేత్ కోమండూరి ఈ సాంగ్ కు తనదైన శైలిలో సంగీతం అందించారు. ఏ.డి మార్గల్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సాంగ్ కు శ్రీకాంత్ పట్నాయక్ ఆర్ ఎడిటర్ అలాగే ఆర్.మురళీమోహన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఆర్. చంద్రమోహన్ ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్. షాబానో సాంగ్ తెలుగు తో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల అయ్యింది, అన్ని భాషల్లో ఈ సాంగ్ ను సోని కోమండూరి పాడడం జరిగింది, సోని కోమండూరి బాహుబలి సినిమాలో హంసనావ పాట పాడడం విశేషం.

Shahbano Telugu Video Song | Malvi Malhotra |Saketh Komanduri |Bhaskar Bantupalli |Sony Komanduri

Latest News

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు సినీ పరిశ్రమ లో అజాత...

More News