టాలీవుడ్

‘వృషభ’ భారీ యాక్షన్ సన్నివేశాల ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, రోషన్ మేకా ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్నపాన్ ఇండియా మూవీ ‘వృషభ’ భారీ యాక్షన్ సన్నివేశాల ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి

మలయాళ సూపర్ స్టార్ మెహన్ లాల్, టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేకా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘వృషభ’… ‘ది వారియర్ అరైజ్’ ట్యాగ్ లైన్. జహ్రా ఖాన్, శనయ కపూర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్, ఏవీఎస్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నంద కిషోర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మథూర్, సౌరభ్ మిశ్రాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏకకాలంలో తెలుగు, మలయాళీ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీని హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయబోతోన్నారు.

అనౌన్స్మెంట్ రోజు ఈ సినిమా అంచనాలు పెరిగాయి. జూన్ 22న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయ్యింది. ఇందులో మోహన్ లాల్, రోషన్ మేకా, శనయకపూర్, శ్రీకాంత్ మేకా, రాగిణి ద్వివేదిలపై ప్రధాన సన్నివేశాలను, భారీ యాక్షన్ సీక్వెన్సులను తెరకెక్కించారు. మూన్ లైట్ (2016), థ్రీ బిల్‌బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ (2017) వంటి ఎన్నో హాలీవుడ్ సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన హాలీవుడ్ కి చెందిన నిక్ తుర్లో నిక్ తుర్లోని ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా తీసున్నారు. బాహుబలి, మన్యం పులి, ది బాస్, గజిని, రోబో, పుష్ప ది రైజ్ వంటి సినిమాలకు పని చేసి యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ ఈ సినిమాకు ఫైట్స్ డిజైన్ చేస్తున్నారు.

డైరెక్టర్ నంద కిషోర్ మాట్లాడుతూ ”ఫస్ట్ షెడ్యూల్ ను జూలైలో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనుకున్న ప్లానింగ్ ప్రకారం ఈ షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యింది. రీసెంట్ మైసూర్ లో చిత్రీకరించిన సన్నివేశాలతో ఈ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. మా ఎంటైర్ ప్రొడక్షన్ టీమ్ రాత్రి, పగలు ఎంతో కష్టపడటంతో అనుకున్న సమయంలోనే ఇంత భారీ షెడ్యూల్ ను పూర్తి చేశాం. మోహన్ లాల్, రోషన్, శనయ, శ్రీకాంత్, రాగిణి ఇచ్చిన సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మన్యం పులి తర్వాత మోహన్ లాల్, పీటర్ హెయిన్స్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్సులు బిగ్గెస్ట్ యాక్షన్ సీక్వెన్సులుగా అందరినీ అలరిస్తాయి” అన్నారు.

తండ్రీ కొడుకుల మధ్య వచ్చే హై ఆక్టేన్ ఎమోషనల్ డ్రామాగా వృషభ రాబోతోంది. ఈ సినిమాలో ఎమోషన్స్, వీఎఫ్ఎక్స్, యాక్షన్ సీక్వెన్స్ భారీ ఎత్తున చూపించబోతోన్నారు. వచ్చే ఏడాదిలో రిలీజ్ కాబోతోన్న 2024లో ‘వృషభ’ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా ఆడియెన్స్ ని అలరించనుంది.

కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్, ఏవీఎస్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నంద కిషోర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మథూర్, సౌరభ్ మిశ్రాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏకకాలంలో తెలుగు, మలయాళీ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీని హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయబోతోన్నారు. పి.ఆర్.ఒ: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణీ కందుకూరి (బియాండ్ మీడియా)

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

10 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago