శ్రీ వెంకట లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 చిత్రం.. విజయదశమిని పురస్కరించుకుని.. హైదరాబాద్ సినీ సర్కార్ ఆఫీస్‌లో స్ర్కిప్ట్ పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ కార్యక్రమానికి సీనియర్ హీరో సుమన్ ముఖ్య అతిథిగా హాజరై.. పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమాకు పనిచేసే 24 శాఖలకు సంబంధించిన వారంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుమన్ హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘మహరాజు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇంతకు ముందు ఈ బ్యానర్‌లో ‘అల్లుడు బంగారం’, ‘అంతేనా.. ఇంకేం కావాలి’ వంటి చిత్రాల తర్వాత తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా నిర్మించబోతున్నట్లుగా దర్శకనిర్మాత వెంకట నరసింహ రాజ్ తెలిపారు.
ఈ సందర్భంగా దర్శకనిర్మాత వెంకట నరసింహ రాజ్ మాట్లాడుతూ.. ‘‘మా బ్యానర్‌లో రాబోతున్న మూడవ చిత్రం ‘మహరాజు’. సుమన్ గారు హీరో. విజయదశమిని పురస్కరించుకుని స్క్రిప్ట్ పూజా కార్యక్రమాలు నిర్వహించాం. వైవిధ్యమైన కథతో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాం. వచ్చే నెలలో రాజమండ్రి పరిసర ప్రాంతాలలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ప్రముఖ నటీనటులతో పాటు కొత్తవారు కూడా ఈ సినిమాలో నటించబోతున్నారు. పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తాం..’’ అని తెలిపారు.
సుమన్ హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి
కెమెరా: పిఆర్ చందర్ రావు
సంగీతం: శ్రీ వెంకట్
ఆర్ట్ డైరెక్టర్: గిరి
కాస్ట్యూమ్ : తిరుపతి
పాటలు: కాసర్ల శ్యామ్
ఎడిటింగ్: నందమూరి హరి
పీఆర్వో: బి. వీరబాబు
సహ నిర్మాత: సి ఈశ్వర్ రెడ్డి
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాత: వెంకట నరసింహ రాజ్
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…