గోపీచంద్ 31,ప్రొడక్షన్ నెం 14గ్రాండ్ గా ప్రారంభం

మాచో హీరో గోపీచంద్ తన 31వ చిత్రం కోసం ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్షతో చేతులు కలిపారు. ప్రతిష్టాత్మక బ్యానర్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నుంచి ప్రొడక్షన్ నంబర్ 14గా కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.
ఈ అద్భుతమైన కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పూజా కార్యక్రమం ఈరోజు చిత్ర యూనిట్ సమక్షంలో లాంఛనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత రాధామోహన్ మాట్లాడుతూ.. ”మా ప్రొడక్షన్ నంబర్ 14లో హీరో గోపీచంద్, దర్శకుడు హర్షతో కలసి పని చేయడం ఆనందంగా ఉంది. ఈ నెలలోనే సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుంది” అన్నారు.

కన్నడలో పలు బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను అందించిన హర్ష, భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. గోపీచంద్ ఇంతకు ముందు కొన్ని హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లు చేసినప్పటికీ, ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్, ఇతర ఎలిమెంట్స్ తో కూడిన మాసీవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది.

ఈ చిత్రంలో కొంత మంది అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. స్వామి జే సినిమాటోగ్రాఫర్ కాగా, కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. రమణ వంక ప్రొడక్షన్ డిజైనర్.
త్వరలో ఇతర నటీనటులు, టెక్నికల్ టీం వివరాలను మేకర్స్ అనౌన్స్ చేస్తారు.

తారాగణం: గోపీచంద్

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: ఎ హర్ష
నిర్మాత: కెకె రాధామోహన్
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
డీవోపీ: స్వామి జె
సంగీతం: రవి బస్రూర్
ప్రొడక్షన్ డిజైనర్: రమణ వంక
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

9 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

5 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago