కిమ్స్ సన్ షైన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించిన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌) ప్రెసిడెంట్ విష్ణు మంచు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కి విష్ణు మంచు ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తరువాత ఆరోగ్యానికి పెద్ద పీఠ వేసిన సంగతి తెలిసిందే. ‘మా’ సభ్యుల ఆరోగ్యం కోసం ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్‌లను విష్ణు మంచు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సిటీలోని పెద్ద మల్టీస్పెషాల్టీ హాస్పిటల్స్‌తో కలిసి హెల్త్ క్యాంప్‌లను నిర్వహించారు. ఇక ఈ హెల్త్ క్యాంప్‌లో ‘మా’ సభ్యులంతా పాల్గొని విజయవంతం చేస్తున్నారు.

ఇక ఈక్రమంలో ఆదివారం నాడు కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ‘మా’ సభ్యుల కోసం విష్ణు మంచు హెల్త్ క్యాంప్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘మా’ ప్రెసిడెంట్ విష్ణు మంచు, ‘మా’ ట్రెజరర్ శివ బాలాజీ, రాజీవ్ కనకాల వంటి వారు పాల్గొన్నారు. ఇక హాస్పిటల్ తరుపున కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ సీఓఓ సుధాకర్ జాదవ్, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ డా. నవ వికాస్ జుకంటి, కన్సల్టంట్ వాస్క్యులర్, ఎండోవాస్క్యులర్, డయాబెటిక్ ఫుడ్ స్పెషలిస్ట్ డా. నిషాన్ రెడ్డి, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్, డా. ముదుమల ఐసాక్ అభిలాష్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో విష్ణు మంచు మాట్లాడుతూ .. ‘‘మా’ సభ్యుల ఆరోగ్యం కోసం నిర్వహిస్తున్న హెల్త్ క్యాంప్‌లను విజయవంతం చేసిన సభ్యులకు, హాస్పిటల్ బృందానికి ధన్యవాదాలు. సభ్యుల ఆరోగ్యమే మాకు ప్రాధాన్యం. అందుకే ఇలా నిత్యం హెల్త్ క్యాంప్‌లను నిర్వహిస్తున్నాం. మాకు సహకరించిన కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ బృందానికి ధన్యవాదాలు’ అని అన్నారు.

శివ బాలాజీ మాట్లాడుతూ .. ‘‘మా’ సభ్యుల ఆరోగ్యం, సంక్షేమం కోసం మేం ఎల్లప్పుడూ ముందుంటాం. అందుకే ఇలా నిత్యం హెల్త్ క్యాంప్‌ల్ని నిర్వహిస్తూ ఉన్నాం. వీటికి సహకరిస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

రాజీవ్ కనకాల మాట్లాడుతూ .. ఆర్టిస్టులు ఎక్కువగా సమయం అనేది పట్టించుకోకుండా పని చేస్తుంటారు. “మా” సభ్యుల కోసం ఇలా నిత్యం హెల్త్ క్యాంప్ లు నిర్వహిస్తుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ సీఓఓ సుధాకర్ జాదవ్ మాట్లాడుతూ .. ‘‘మా’ సభ్యుల కోసం ఇలా హెల్త్ చెకప్ నిర్వహించడం గొప్ప విషయం. ఈ కార్యక్రమం కోసం ముందుకు వచ్చిన విష్ణు మంచు గారికి అభినందనలు. మేం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఎల్లప్పుడూ వారికి సహకరిస్తూనే ఉంటామ’ని అన్నారు.

TFJA

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago