వైరల్ అవుతోన్న “మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ” కవర్ సాంగ్

Must Read

పెళ్ళిసందడి సినిమాలోని ” మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ” పాట ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. వేటూరి రచన, కీరవాణి సంగీతంలో చిత్ర పాడగా అప్పట్లో రాఘవేంద్ర రావు అద్భుతంగా తెరకెక్కించారు. అప్పటి హీరోయిన్ రవళి అందంతో పాటు తన అభినయాన్ని కూడా అద్భుతంగా ప్రదర్శించి ఆకట్టుకున్నారు. దాదాపు 27 సంవత్సరాల తర్వాత ఇదే పాటను మళ్ళీ వర్ధమాన నటి రేఖా భోజ్ రీ-క్రియేట్ చేశారు.

Maa Perati Jamchettu మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ (Telugu) Cover Song | Pelli Sandadi | Rekha Boj

అంతేకాకుండా ఈ కవర్ సాంగ్ ని రాఘవేంద్ర రావు చేతుల మీదుగానే లాంఛ్ చేయగా యూట్యూబ్ లో విడుదల అయ్యింది. ఆ పాత పాట ఫ్లేవర్ ఎక్కడా పోకుండా చాలా అందంగా చిత్రీకరించిన ఈ పాటలో నటి రేఖా భోజ్ అభినయం, అందం హైలైట్ గా నిలిచాయని నెటిజన్స్ అంటున్నారు. స్వల్ప వ్యవధిలోనే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారడం విశేషం. మీరూ ఓ లుక్కేయండి మరి

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News