తెలుగు సినీ రంగంలో దర్శకుడిగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న దర్శకుల్లో ఒకరైన కె.విజయ్‌భాస్కర్ మళ్లీ ఓ సరికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. నువ్వేకావాలి, మన్మథుడు, మల్లీశ్వరి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన స్వీయ దర్శకత్వంలో ఉషా పరిణయం బ్యూటిఫుల్ టైటిల్‌తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.
ఈ చిత్రానికి లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉపశీర్షిక. విజయ్‌భాస్కర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ పతాకంపైకె.విజయ్‌భాస్కర్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్‌భాస్కర్ తనయుడు శ్రీకమల్ హీరోగా నటిస్తుండగా, తాన్వీ ఆకాంక్ష అనే అచ్చతెలుగమ్మాయి ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం కాబోతుంది. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. తాజాగా ఈ చిత్రం నుంచి ఆకాశానికే జాబిలి అందం.. భూగోళానికే నా చెలి అందం అంటూ కొనసాగే ఓ ప్రేమగీతాన్ని ఈ చిత్రం నుంచి తొలి లిరికల్ సాంగ్‌గా విడుదల చేశారు. ఆర్.ఆర్. ధ్రువన్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటకు అలరాజు సాహిత్యం అందించారు. ఆర్.ఆర్. ధ్రువన్ ఈ ప్రేమగీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత విజయ్ భాస్కర్ మాట్లాడుతూ ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రేమకథలో సరికొత్తగా వుండే విధంగా ఉషా పరిణయం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ప్రేమకు నేనిచ్చే డెఫినేషన్. ఇదొక మంచి లవ్‌స్టోరి, సినిమా లవర్స్‌కు విందుభోజనం లా వుంటుంది. అన్ని ఎమోషన్స్ ఈ చిత్రంలో వున్నాయి. ఈ సినిమా సంగీతంలో ధ్రువన్ విశ్వరూపం చూస్తారు* అన్నారు.
శ్రీకమల్, తాన్వి ఆకాంక్ష, సూర్య, రవి, శివతేజ, అలీ, వెన్నెలకిషోర్, శివాజీ రాజా, ఆమని, సుధ, ఆనంద్ చక్రపాణి, రజిత, బాలక్రిష్ణ, సూర్య, మధుమణి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకి సంగీతం : ఆర్ ఆర్ ధ్రువన్, డీఓపీ: సతీష్ ముత్యాల, ఎడిటింగ్: ఎమ్ ఆర్ వర్మ, దర్శకత్వం-నిర్మాత :కె.విజయ్‌భాస్కర్
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…