టాలీవుడ్

‘డార్లింగ్’ నుంచి సున్ చలియా సాంగ్ రిలీజ్

రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ జానర్‌లలోకి వచ్చే సినిమాలు ఆడియన్స్ ఎక్స్ పీరియన్స్ ను బూస్ట్ చేయడానికి చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లు అవసరం. ఈ జానర్ చిత్రాలు ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషిస్తుంది.’ డార్లింగ్’ సినిమా విడుదలకు ముందే మ్యూజికల్ హిట్‌గా మారింది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రానికి అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని మొదటి రెండు పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ రోజు, మేకర్స్ థర్డ్ సింగిల్ సున్ చలియాను రిలీజ్ చేశారు.

మొదటి రెండు పాటలు ప్రియదర్శి, నభా నటేష్‌ల సోలో నంబర్‌లు కాగా, మూడవ పాట ఇద్దరూ కలసి అలరించిన డ్యూయెట్. వివేక్ సాగర్ ఈ పాటని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లవ్ సాంగ్ అఫ్ ది ఇయర్ గా చాలా బ్యూటీఫుల్ గా కంపోజ్ చేశారు. అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్‌తో ఈ పాట మెస్మరైజ్ చేస్తోంది. వివేక్ మ్యూజిక్ సాంగ్ మూడ్‌కి పర్ఫెక్ట్. కాసర్ల శ్యామ్ లిరిక్స్ లవ్లీగా వుండగా, అనురాగ్ కులకర్ణి వోకల్స్ ఎక్స్ప్రెసివ్ గా వున్నాయి. 

ఈ పాట లీడ్ పెయిర్ ప్రియదర్శి, నభా నటేష్ ల లవ్లీ జర్నీని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. ఈ పాటలో వీరిద్దరూ స్పార్క్లింగ్ కెమిస్ట్రీని షేర్ చేసుకున్నారు. ఈ పాట ఇన్స్టంట్ ఇంప్రెషన్ ని క్రియేట్ చేస్తోంది, థియేట్రికల్ రిలీజ్ కి ముందే ఇది చాలా పాపులర్ అవుతుంది.

ఈ చిత్రానికి హేమంత్ డైలాగ్స్ రాస్తుండగా, లవ్ టుడే ఫేం ప్రదీప్ ఇ రాఘవ్ ఎడిట్ చేస్తున్నారు. గాంధీ ప్రొడక్షన్ డిజైనర్.

‘డార్లింగ్’ మూవీ జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

నటీనటులు: ప్రియదర్శి, నభా నటేష్, బ్రహ్మానందం, విష్ణు, కృష్ణ తేజ్, అనన్య నాగళ్ల తదితరులు 

సాంకేతిక సిబ్బంది:

రచన- దర్శకత్వం: అశ్విన్ రామ్

నిర్మాతలు: కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య

బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్

సంగీతం: వివేక్ సాగర్

డీవోపీ: నరేష్ రామదురై

ఎడిటర్: ప్రదీప్ ఇ రాఘవ

డైలాగ్స్: హేమంత్

ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ

పబ్లిసిటీ డిజైనర్: అనంత్ కంచర్ల

క్రియేటివ్ ప్రొడ్యూసర్: సీతారామ్ వై

లిరిక్స్: కాసర్ల శ్యామ్

కొరియోగ్రాఫర్: విజయ్ పోలాకి, ఈశ్వర్ పెంటి

ప్రాజెక్ట్ కన్సల్టెంట్: సన్నీ బాండ్

కాస్ట్యూమ్ డిజైనర్: పూర్ణిమా రామస్వామి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : ప్రకాష్ రెడ్డి పన్నాల, వంశీ సంగెం

లైన్ ప్రొడ్యూసర్: మంచి వెంకట్

పీఆర్వో: వంశీ-శేఖర్

డిజిటల్: హాష్‌ట్యాగ్ మీడియా

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

5 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago