ఎస్ కేఎన్ చేతుల మీదుగా “లవ్ రెడ్డి” సినిమా ట్రైలర్ రిలీజ్

గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “లవ్ రెడ్డి” . అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా నూతన దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రొడ్యూసర్స్ సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి “లవ్ రెడ్డి” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమ, సుస్మిత, హరీష్, బాబు, రవి కిరణ్, జకరియా సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా “లవ్ రెడ్డి” సినిమా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు సక్సెస్ ఫుల్ నిర్మాత ఎస్ కేఎన్ చేతుల మీదుగా “లవ్ రెడ్డి” సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా

ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ – “లవ్ రెడ్డి” సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. 20 మంది యంగ్ టాలెంట్స్ ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఈ నెల 18న “లవ్ రెడ్డి” సినిమా రిలీజ్ అవుతోంది. మీ దగ్గరలోని థియేటర్స్ లోకి వెళ్లి సినిమా చూడండి. “లవ్ రెడ్డి” సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.

“లవ్ రెడ్డి” సినిమా ట్రైలర్ లవ్, ఎమమోషనల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది. హీరో క్యారెక్టర్ పేరు నారాయణరెడ్డి. ఇంట్లో వాళ్లు ఆయనకు ఎన్నో పెళ్లి సంబంధాలు చూస్తారు. ఏ అమ్మాయి నారాయణరెడ్డికి నచ్చదు. ఓ ఫంక్షన్ లో అందమైన అమ్మాయిని ఇష్టపడి లవ్ రెడ్డిగా మారిపోతాడు. అప్పటి నుంచి ఆ అమ్మాయే లోకంగా బతుకుతాడు. తనది రెగ్యులర్ నిబ్బా నిబ్బీ లవ్ స్టోరీ కాదంటాడు. ఓ రోజు ఆ అమ్మాయి నారాయణరెడ్డిని రిజెక్ట్ చేస్తుంది. ప్రాణం కన్నా ప్రేమించిన ఆ అమ్మాయి నారాయణరెడ్డి ఉరఫ్ లవ్ రెడ్డిని ఎందుకు రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత హీరో లైఫ్ ఎలా టర్న్ అయ్యింది. వీరి ప్రేమ కథ చివరికి ఎక్కడికి చేరింది అనేది ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. రాయలసీమ నేపథ్యంతో, అక్కడి యాసలో సినిమా ఆకట్టుకోనుంది.

నటీనటులు – అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి, తదితరులు

టెక్నికల్ టీమ్

సంగీతం – ప్రిన్స్ హేన్రి
ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రవీంద్ర రెడ్డి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్)
సహా నిర్మాతలు – సుమ, సుస్మిత, హరీష్, బాబు, రవి కిరణ్, జకరియా
నిర్మాతలు- సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి
రచన, దర్శకత్వం: స్మరన్ రెడ్డి

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago