“ప్రత్యక్ష దైవం షిర్డిసాయి” గీతావిష్కరణ!!

   దత్త ఫిలిమ్స్ నిర్మాణంలో మచ్చా రామలింగారెడ్డి షిర్డిసాయిగా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “ప్రత్యక్ష దైవం షిర్డిసాయి“. భానుచందర్, సీత ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ఆడియో వీడియో పాటల ప్రదర్శన హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది.

శ్రీభంసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో విశ్రాంత ఇన్ కంటాక్స్ ప్రిన్సిపల్ ఛీప్ కమీషనర్ నరసింహప్ప అధ్యక్షతన జరిగిన ఈ పాటల ఆవిష్కరణ కార్యక్రమంలో దర్శకులు ఓం సాయి ప్రసాద్, రేలంగిన రసింహారావు, ఇన్ కంటాక్స్ కమీషనర్ జీవన్ లాల్, పాటల రచయిత బిక్కికృష్ణ, ఎసిపి రామ్ దాస్ తేజ, లయన్ డా.విజయ్ కుమార్, వి.డి.రాజగోపాల్, శ్రీమతి గిడుగు కాతికృష్ణ, సీనియర్ జర్నలిస్తులు ప్రభు, ధీరజ అప్పాజీ తదితరులు పాల్గొన్నారు!!

     శతచిత్ర దర్శకులు ఓం సాయి ప్రకాష్ మాట్లాడుతూ సాయితత్వాన్ని ప్రచారం చేయడానికే తనను కర్ణాటక పంపించారన్నారు. మచ్చా రామలింగారెడ్డి సాయిపాత్రను ధరించి సాయిభక్తుల అనుభవాలతో చిత్రం తీయడం అభినందనీయమన్నారు. చీఫ్  కమీషనర్ నరసింహప్ప మాట్లాడుతూ… సాయితత్వాన్ని జనంలోకి తీసుకొనిపోవడానికి సినిమా మీడియా బాగా ఉపయోగపడుతుందన్నారు.

యువతరంలో ఆధ్యాత్మికతను  పెంపొందించడానికి ప్రత్యక్షదైవం షిర్డిసాయి చిత్రాన్ని మచ్చా రామలింగారెడ్డి నిర్మించడం గొప్ప విషయమన్నారు. భక్తిరస చిత్రాన్ని యం.ఆర్.రెడ్డి నిర్మించడం అభినందనీయమని కమీషనర్ జీవన్ లాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు కొండవీటి సత్యం, నిర్మాతలు వెంకట్,vసుబ్బారావు, సంగీతదర్శకులు కిషన్ కవాడియా తదితరులు పాల్గొన్నారు!!

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago