“గ్రంథాలయం” ట్రైలర్ లాంచ్

వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌ పతాకం పై విన్ను మద్దిపాటి, స్మిరితరాణిబోర, కాలికేయ ప్రభాకర్‌, కాశీవిశ్వనాథ్‌, డా.భద్రం, సోనియాచదరి నటీనటులుగా సాయిశివన్‌ జంపాన దర్శకత్వంలో ఎస్‌. వైష్ణవి శ్రీ నిర్మిస్తున్న కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ “గ్రంథాలయం”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 3 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా  చిత్రం ట్రైలర్ ను ప్రసాద్ ల్యాబ్ లో గ్రాండ్ గా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన నిర్మాతల  మండలి అధ్యక్షులు కె. యల్. దామోదర్ ప్రసాద్,ప్రముఖ దర్శకులు బి. గోపాల్ చేతులమీదుగా  చిత్ర  ట్రైలర్ ను విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కె.ఎల్. దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ..నన్ను  ప్రెసిడెంట్ గా గెలిపించిన అందరికీ నా ధన్యవాదాలు.“గ్రంథాలయం” అచ్చ తెలుగు టైటిల్. ఈ మధ్యకాలంలో ఇలాంటి టైటిల్స్ తక్కువ చూస్తున్నాం. ట్రైలర్  చూసినప్పుడు కథ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇందులో ఎమోషన్ కూడా చాలా ఉంది. హీరో విన్ను చాలా బాగా చేశాడు.దర్శకుడు మంచి కథను సెలెక్ట్ చేసుకొని తీశాడు.ఈ రోజుల్లో సినిమాలు తీయడం చాలా కష్టం.సినిమాలు తీయడం ఒక ఎత్తయితే దానిని నెక్స్ట్ స్టేజ్ కి తీసుకెళ్లడం చాలా కష్టం. నేను బిగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా నేను తీసిన మెదటి సినిమా రిలీజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఆ సినిమా హిట్ అయింది కాబట్టి ఇప్పటి వరకు ఈ రోజు ఉన్నాం. ఆలా ఈ సినిమా తీసిన  నిర్మాతకు కూడా ఈ సినిమా బిగ్ హిట్ అయితే తను ఇంకా ఎన్నో సినిమాలు తీయగలుగుతాడు. మార్చి 3 న వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అయ్యి దర్శక, నిర్మాతలకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటుడు కాశీవిశ్వనాథ్ మాట్లాడుతూ.. గ్రంథాలయం సినిమాలో హీరోగా చేసిన విన్ను మద్దిపాటి నాకు కజిన్ అవుతాడు.. సినిమా మీద ప్యాషన్ తో “శేఖరం గారి అబ్బాయి” సినిమా చేశాడు. ఆ సినిమా తనకు మంచి పేరు తెచ్చింది.తను చేసే ప్రతి ప్రాజెక్ట్ నాతో డిస్కషన్ చేస్తాడు. తనకు సినిమాపై ఎంతో జీల్ ఉంది నాకు అర్థం అయ్యేది. విన్ను కు తగ్గ డైరెక్టర్ దొరికితే మంచి హీరో అవుతాడు అనుకున్నాను. నేను అనుకున్నట్లే ఈ సినిమా ద్వారా మంచి డైరెక్టర్ దొరికాడు.ఈ గ్రంధాలయం చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. టెక్నీషియన్స్ అందరూ కూడా ఈ సినిమాకు ప్రాణం పెట్టి  పని చేశారు.మార్చి 3 న వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర దర్శకులు సాయి శివన్ మాట్లాడుతూ.. ఈ స్టేజ్ కి నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. 2017 లో మొదటిసారి ఈ స్టేజ్ ఎక్కడానికి కారణమైన జీవిత రాజశేఖర్ గారికి ధన్యవాదములు. నేను గరుడవేగ సినిమాకు వర్క్ చేసిన తరువాత  తెలుగు కన్నడ భాషల్లో వైరం సినిమా స్టార్ట్ చేశాము.. ఆ సినిమా చేస్తున్నప్పుడు హీరో విన్ను కు ఈ లైన్ చెప్పడం జరిగింది. ఈ సినిమా విషయానికి వస్తే కల చెప్పిన కథే ఈ “గ్రంధాలయం”. నాకొచ్చిన కలను కథగా రాసుకున్నాను. సూపర్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ఒక సస్పెన్స్ కాన్సెప్టు ను  కమర్షియల్ గా ఫస్ట్ టైం ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము. ఇందులో మాస్ కావలసిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి.రెండు సినిమాలు ప్యార్లల్ గా చేస్తున్న మాకు కరోనా రావడంతో కొంచెం ఇబ్బంది పడ్డాము. కరోనా తర్వాత ఈ రెండు సినిమాలు కంప్లీట్ చేశాము. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం కల్పించిన నిర్మాతలకు మేము రుణపడి ఉంటాము. మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకు చాలా మంచి పాటలు ఇచ్చారు.థియేటర్ లోకి వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది మార్చి 3న వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

నిర్మాత అయ్యప్ప అల్లం నేని మాట్లాడుతూ.. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన లెజెండరీ బి.గోపాల్ గారికి, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్  దామోదర్ ప్రసాద్ గారికి, నటులు కాశీవిశ్వనాథ్ గారికి ధన్యవాదాలు.
‘‘గ్రంధాలయం కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా సాగుతుంది.మార్చి 3న వస్తున్న మా సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరూ మా సినిమాను చూసి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర హీరో విష్ణు మద్దిపాటి మాట్లాడుతూ. ఈ సినిమాకు ముందు డైరెక్టర్ సాయి శివన్ తో వైరం సినిమా స్టార్ట్ చేశాము.ఆ సినిమా చేస్తున్నప్పుడే ఈ సినిమా కథ చెప్పడం జరిగింది. ఈ కథను నాకు బాగా నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. తను చేసే సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని వాళ్ళ అమ్మ ఎదురు చూసింది. తన సినిమాలు చూడకుండానే వాళ్ళమ్మ చనిపోవడం చాలా బాధాకరం. తను చాలా హార్డ్ వర్క్ వర్కర్.ఇలాంటి సినిమాలు తాను ఎన్నో సినిమాలు చేసి గొప్ప దర్శకుడు అవ్వాలి. మ్యూజిక్ డైరెక్టర్ విష్ణువర్ధన్ ఇందులో మంచి మ్యూజిక్ ఇచ్చాడు అందరికీ ఇందులోని పాటలు కచ్చితంగా నచ్చుతాయి. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. “గ్రంథాలయం” సినిమా మార్చి 3 న రిలీజ్ అవుతుంది.అందరూ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఈ సినిమా చూసి సక్సెస్ చేయాలని కోరుతున్నాను

లైన్ ప్రొడ్యూసర్ మహేష్ మాట్లాడుతూ :  మార్చి 3న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను అందరూ చూసి సక్సెస్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

ఎడిటర్ గుణశేఖర్ మాట్లాడుతూ..విష్ణు గారితో నాకు టెన్ ఇయర్స్ నుంచి పరిచయం. గ్రంధాలయం సినిమాకు చాలా మంచి అవుట్ పుట్ వచ్చింది.ఎంత ఖర్చు పెట్టారో అంత స్క్రీన్ పై  కనిపిస్తుంది.చూసిన ప్రతి ఒక్కరికీ  ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది అన్నారు.

హీరోయిన్ స్మిత రాణి మాట్లాడుతూ.. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు.

నటీనటులుః
విన్నుమద్దిపాటి, స్మిరితరాణిబోర, కాలకేయప్రభాకర్‌, సోనియాచౌదరి, అలోక్‌జైన్‌, జ్యోతిరానా, కాశీశినాథ్‌, డా.భద్రం, మేకరామకృష్ణ, పార్వతి, శివ, శ్రావణి, మురళీకృష్ణ, నవ్యశారద, నరేంద్రనాయుడు. స్నేహగప్త తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ ::వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ః) : అల్లంనేని అయ్యప్ప,
రచన దర్శకత్వం : సాశివన్‌జంపాన.
సినిమాటోగ్రఫీ : సామలభాస్కర్‌,
సంగీతం : వర్ధన్‌,
ఎడిటర్‌ : శేఖర్‌పసుపులేటి,
బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ఃల్ : చిన్నా,
ఆర్ట్‌డైరెక్టర్‌ : రవికుమార్‌ మండ్రు,
పి. ఆర్. ఓ : దీరజ్, ప్రసాద్
Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

15 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago