ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్‌తో రూపొందిన ‘ఎల్‌జీఎం’ (LGM – Lets Get Married) తెలుగు ట్రైలర్ విడుదల
ధోని, సాక్షి నిర్మాతలుగా రూపొందుతోన్న ‘ఎల్‌జీఎం’ (LGM – Lets Get Married) చిత్రం.. త్వరలోనే విడుదల
మారుతున్న ట్రెండ్‌లో ప్రేమకు అర్థం మారిపోయింది. అమ్మాయి అబ్బాయి లివ్ ఇన్ రిలేషన్‌లో ఉండి.. నచ్చితే పెళ్లి బంధం వైపు అడుగులు వేస్తున్నారు. పెళ్లికి ముందు ఇదేం ప్యాషన్ అని అనుకోవచ్చు. కానీ.. అబ్బాయిని అమ్మాయి.. అమ్మాయిని అబ్బాయి అర్థం చేసుకోవటానికే ఈ లివ్ ఇన్ రిలేషన్ అనే భావన ఉండటంతో చాలా మంది అటు వైపుగానే ఆలోచనలు చేస్తున్నారు. సరే ఇదంతా బాగానే ఉందని అనుకుందాం.. అయితే పెళ్లి చేసుకుని ఓ ఇంట్లోకి కోడలిగా అడుగు పెట్టాల్సిన అమ్మాయి తన ప్రేమికుడిని విచిత్రమైన కోరిక కోరుతుంది. తనకు కాబోయే అత్తవారితో కలిసి కొన్ని రోజులు ట్రిప్‌కు వెళతానని అప్పుడు ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికీ తెలుస్తుందని చెబుతుంది. నిజంగా ఇది కాస్త విచిత్రంగానే ఉన్నా.. కాబోయే అత్తా కోడలు.. కలిసి చేసే ప్రయాణం.. వారి మధ్య ఉన్న అబ్బాయి వారి సమస్యలను సర్దుబాటు చేయలేక మానసికంగా పడే బాధలను తెలుసుకోవాలంటే ‘ఎల్‌జీఎం’ ( LGM (Lets Get Married)) సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.
ఇండియన్ క్రికెట్ హిస్ట్రరీలో సక్సెస్‌ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై LGM సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రమేష్ తమిళ్ మణి దర్శకత్వం వహించటంతో పాటు సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాక్షి ధోని, వికాస్ హస్జా నిర్మిస్తున్నారు. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఇప్పటి వరకు మన సినిమాల్లో రానటువంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో LGM తెరకెక్కుతుందని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇక సినిమాలో హీరో హరీష్ కళ్యాణ్, హీరోయిన్ ఇవానాతో పాటు హీరో తల్లిగా నటించిన నదియా చాలా కీలక పాత్రలో అలరించారు. ఇక సినిమాలో ఆడియెన్స్‌ను తనదైన కామెడీతో అలరించటానికి యోగి బాబు LGM చిత్రంతో రెడీ అయ్యారు.
సినిమా గురించి దర్శకుడు రమేష్ తమిళ్ మణి మాట్లాడుతూ ‘‘వైవిధ్యమైన చిత్రాలను ఆదరించటంతో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ఇది చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో LGM సినిమాను రూపొందించాను. కుటుంబం ఎలా ఉండాలి. పరిస్థితులను ఎలా అవగాహన చేసుకోవాలి. సర్దుకు పోవాలనే విషయాలను కామెడీ కోణంలో చూపిస్తూనే మంచి ఎమోషనల్ టచ్‌తో సినిమాను రూపొందించాం. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.
మహేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ ‘‘నేను సినిమా చూశాను. చాలా క్లీన్ మూవీ. చక్కటి ఎంటర్‌టైనర్. నేను నా కుమార్తెతో కలిసి ఎల్‌జీఎం సినిమా చూస్తాను. తను నన్ను చాలా ప్రశ్నలు వేస్తుంది. అయితే కూడా నేను తనతోనే సినిమా చూస్తాను. నటీనటులు, టెక్నీషియన్స్ అద్భుతంగా వర్క్ చేశారు. చాలా మంచి టీమ్ కుదిరింది. ఈ సినిమాను నేను రూపొందించినందుకు గర్వంగా ఉంది. డైరెక్టర్ రమేష్ తమిళ్ మణి ఓ ఆర్కిటెక్ట్ కూడా.
నా భార్య సినిమా చేయాలని నాతో చెప్పినప్పుడు నేను తనతో ఒకే మాట చెప్పాను. అదేంటంటే..సినిమా చేయటం అంటే ఓ ఇంటిని డిజైన్ చేసినట్లు కాదని. నువ్వు ఓ కథను ఫిక్స్ చేసుకుని, నటీనటులను కూడా ఎంపిక చేసుకో. నువ్వు ఒక్కసారి ఓకే అన్నతర్వాత సినిమా చేస్తానని అన్నాను. అలా సినిమాను స్టార్ట్ చేశాం. మంచి టీమ్ కారణంగానే తక్కువ సమయంలోనే సినిమాను కంప్లీట్ చేశాం. సినిమా యూనిట్‌కు మంచి ఫుడ్ ఉండేలా చూసుకోమని చెప్పాను.
నేను విధిని నమ్ముతాను. నా టెస్ట్ కెరీర్ చెన్నైలోనే ప్రారంభమైంది. క్రికెట్ విషయానికి వస్తే హయ్యస్ట్ టెస్ట్ స్కోర్ కూడా చెన్నైలోనే సాధించాను. ఇలా చెన్నైతో నాకు మంచి అనుబంధం ఉంది. ఇక్కడ ప్రజల ప్రేమాభిమానాలు చాలా గొప్పగా ఉన్నాయి. చాలా ఒడుదొడుకుల తర్వాత ఈ ఏడాది మళ్లీ మేం ఫామ్‌లోకి రావటం మరచిపోలేని విషయం. సీఎస్‌కే టీమ్ ఎక్కడకు వెళ్లినా అక్కడ మాకు అపరిమితమైన ప్రేమ దొరికింది. ఇక ఎల్‌జీఎం సినిమా విషయానికి వస్తే త్వరలోనే సినిమాను రిలీజ్ చేస్తాం. చాలా ఎంజాయ్ చేస్తారు. అత్త, కోడలు.. వారి మధ్యలో ఇబ్బంది పడే కొడుకు ఇలా ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన సినిమా ఇది’’ అన్నారు.
సాక్షి ధోని మాట్లాడుతూ ‘‘LGM సినిమా గురించి చెప్పాలంటే మన చుట్టూ చాలా మంది ిలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంటారు. ఇలాంటి పాయింట్ మీద సినిమా ఎందుకు చేయకూడదనిపించింది. అప్పుడు దర్శకుడు రమేష్‌తో మాట్లాడి సినిమాను స్టార్ట్ చేశాం. ఈ సినిమా పర్టికులర్‌గా తమిళంలోనే చేయటానికి కారణం ధోనీయే. చెన్నైతో మాకున్న అనుబంధం కారణంగా మా తొలి సినిమాను ఇక్కడే చేశాం’’ అన్నారు.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…