కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ తో రాబోతున్నారు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్నారు. స్టార్ రైటర్ అబ్బూరి రవి చిత్రానికి డైలాగ్స్ అందించారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. మే 3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. హీరో అడివి శేష్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
ప్రీరిలీజ్ ఈవెంట్ హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను ఈ స్టేజ్ లో, ఇన్ని సంవత్సరాలు పరిశ్రమలో ఉన్నానంటే కారణం మా నాన్నగారు. ఆయన వున్నన్ని రోజులు నాతో సినిమాలు చేసి, హిట్లు ఇచ్చి, నన్ను సక్సెస్ ఫుల్ యాక్టర్ ని చేశారు. ఆయన లేనప్పుడు కూడా ఆయన టైటిల్ ఇచ్చి ఈ సినిమాతో బ్లెస్ చేస్తున్నారు. ఇది బరువుగా, భాద్యతగా ఫీలౌతున్నాను. తప్పకుండా ఆ మంచి పేరుని కాపాడతానని మాటిస్తున్నాను. ఈ వేడుకు వచ్చిన శేష్ గారికి, రవిగారికి, విజయ్ కనకమేడల, విజయ్ బిన్నీ, దేవాకట్టా గారికి పేరుపేరునా ధన్యవాదాలు. దర్శకుడిగా మల్లి అంకంకు ఇది మొదటి సినిమా. చాలా కాలంగా దర్శకుడు కావాలనే కలగని, ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా చేశారు. చాలా మంది కొత్త దర్శకులతో పని చేశాను. దాదాపు 32 మంది కొత్త దర్శకులని పరిచయం చేశాను. 31 మంది రిలీజ్ కి ముందు టెన్షన్ పడ్డారు. ఒక్క మల్లి గారు మాత్రం చాలా కూల్ గా నవ్వుతూ వున్నారు( నవ్వుతూ). అసలు టెన్షన్ అనే మాటే ఆయన డిక్షనరీలో లేదు. నిజంగా అది గ్రేట్ గిఫ్ట్. ఈ సినిమాతో పరిశ్రమకి రాజీవ్ గారు లాంటి మంచి నిర్మాత పరిచయం అవుతున్నారు. ఇలాంటి నిర్మాతలు పరిశ్రమకు చాలా అవసరం. ఈ సినిమా పెద్ద విజయం సాధించి, ఆయన మరో పది చిత్రాలు నిర్మించి, మరో పదిమందికి పని ఇవ్వాలని కోరుకుంటున్నాను. గోపిసుందర్ గారు నాలుగు బ్యూటీఫుల్ సాంగ్స్ ఇచ్చారు. అబ్బూరి రవి గారు, చోటా ప్రసాద్ గారు దాదాపు ఐదారు సినిమాల నుంచి ఒక ఫ్యామిలీలా వర్క్ చేస్తున్నాం. ఈ సినిమాలో సాంగ్స్ చేసిన భాను మాస్టర్, రాజుసుందరం మాస్టర్, విజయ్ బిన్నీ మాస్టర్, రఘు మాస్టర్ అందరికీ థాంక్స్. భాస్కర భట్ల, రామజోగయ్యశాస్త్రీ గారికి ధన్యవాదాలు. ఫారియా వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. తనలో పెక్యులర్ కామెడీ టైమింగ్ వుంది. అది చాలా తక్కువ మందిలో వుంటుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించి మా జోడి మరో రెండు మూడు సినిమాలకు కొనసాగాలని కోరుకుంటున్నాను. జామి లివర్ యంగ్ వెర్షన్ అఫ్ కోవై సరళ లాంటి పాత్ర చేశారు. తన పాత్ర చాలా బావుటుంది. తనకి టాలీవుడ్ కి స్వాగతం. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా మే3న విడుదల కాబోతుంది. ఈ మండు వేసవి మీ బాధలు మర్చిపోయి ఒక రెండు గంటలు హాయిగా ఈ సినిమాని థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి. ఈ సినిమా పెళ్లి కాని వాళ్ళు, పెళ్లి అయినవారు, పెళ్లి సంబంధాలు చూస్తున్నవారు, ప్రతిఒక్కరూ చూడాలి. కామెడీ సినిమా చేసిన, సీరియస్ సినిమా చేసినా కంటెంట్ వున్న సినిమా చేస్తాను. ఈ సినిమా ఆర్గానిక్ కామెడీ. ఇందులో పెళ్లిపేరుతో జరుగుతున్న మోసాలని అందరికీ తెలియజేయాలనే మంచి ఉద్దేశంతో ఈ సినిమా చేయడం జరిగింది. మే3న థియేటర్స్ రండి అందరూ సరదాగా నవ్వుకోండి. అందరికీ ధన్యవాదాలు’ తెలిపారు.
హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. నరేష్ గారితో నాకు చాలా గొప్ప అనుబంధం వుంది. నా ఫస్ట్ ఆడియో లాంచ్ కి నరేష్ గారు ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ రోజు ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకోవడానికి రావడం చాలా ఆనందంగా వుంది. నా మనసులో నరేష్ గారు అంటే ఇంట్లో మనిషి. ఆయన ఎప్పుడూ ఇతరుల ఆనందాన్ని కోరుకుంటారు. ఆయన్ని ఎప్పుడూ కలసి చాలా ఆత్మీయంగా వుంటుంది. అబ్బూరి రవి గారు నా కెరీర్ కి బ్యాక్ బోన్. కలసి ఏడు సినిమాలు చేశాం. రాజీవ్ గారు ఐకానిక్ యానిమేషన్ మూవీస్ పిల్లల్ని ఎలా ఇన్స్పైర్ చేశారో అలాంటి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ఫారియా ని ఫస్ట్ టైం కలిశాను. చాలా అమాయకంగా కనిపించారు. అదే ఇన్నోసెన్స్ కొనసాగిస్తే గర్వపడే స్థాయికి వెళ్తారు. మల్లికి నా బెస్ట్ విశేష్. మా అన్నయ్య టీంలో ఆయన పని చేశారు.మే3న అందరం థియేటర్స్ లో సినిమా చూద్దాం . హాయిగా నవ్వుకుందాం’ అన్నారు.
హీరోయిన్ ఫారియా అబ్దుల్లా మాట్లాడుతూ.. నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ బిగ్ థాంక్స్. నిర్మాత రాజీవ్ గారికి ధన్యవాదాలు. చాలా క్యాలిటీగా సినిమాని తీశారు. నరేష్ గారి ఎంత పెద్ద థాంక్స్ చెప్పినా తక్కువే. కో యాక్టర్ గా చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమాతో నరేష్ గారి రూపంలో ఒక మంచి ఫ్రెండ్ దొరికారు. ఈ విషయంలో చాలా ఆనందంగా వుంది. దర్శకుడు మల్లిగారి ధన్యవాదాలు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరు ధన్యవాదాలు. ఈ హోల్సమ్ ఎంటర్ టైనర్ ని తెరపై చూడటానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అన్నారు.
సహా నిర్మాత భరత్ మాట్లాడుతూ.. నరేష్, ఫారియా తో వర్క్ చేయడం చాలా అనందంగా వుంది. రాజీవ్ తో కలసి అద్భుతమైన చిత్రాలు చేయడానికి ఎదరుచూస్తున్నాం. ఈ బ్యానర్ పరిశ్రమలో బలంగా నిలబడాలని కోరుకుంటున్నాను’అన్నారు.
దర్శకుడు మల్లి అంకం మాట్లాడుతూ.. ముందుగా ఈవీవీ సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా జర్నీలో అమ్మిరాజు గారి ద్వారా నరేష్ గారిని కలిశాను. ఈ సందర్భంగా అమ్మిరాజు గారికి ధన్యవాదాలు. భాను మాస్టర్ రఘు మాస్టర్ రాజు సుందరం మాస్టర్ పాటని అద్భుతంగా తీశారు. భాస్కర భట్ల, రామజోగయ్యశాస్త్రీ గారికి ధన్యవాదాలు. చాలా ప్రేమతో లిరిక్స్ రాశారు. ఆర్ట్ డైరెక్టర్, డీవోపీ సూర్య , ఎడిటర్ చోటాకే ప్రసాద్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ టీంకి ధన్యవాదాలు. అబ్బూరి రవి గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మాటలు అద్భుతంగా రాశారు. నటీనటులందరికీ థాంక్స్. ఇందులో జామి లివర్ పాత్ర అందరినీ ఆకట్టుకునేలా వుంటుంది. ఫారియా ఈ సినిమాకి రావడం వలన సిద్దిగా పాత్ర చాలా హైలెట్ అయ్యింది. అడివి శేష్ మా వేడుకకు రావడం చాలా ఆనందంగా వుంది. నా ఫస్ట్ లవర్ నరేష్ గారు. దర్శకుడిగా అవకాశం రావడానికి చాలా స్ట్రగుల్ చేయాలి. కొత్త దర్శకులకి అవకాశం ఇవ్వడానికి చాలా ఆలోచిస్తుంటారు. కానీ నరేష్ గారు ఇప్పటికే ముఫ్ఫై కి పైగా దర్శకులని పరిచయం చేశారు. ఆయన ఇలానే చేస్తూ మా లాంటి వారికి అండగా వుండాలి. రాజీవ్ గారు చాలా క్యాలిటీతో ఈ సినిమాని తీశారు. అందరినీ అలరించే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. తప్పకుండా ఆడియన్స్ ని అలరిస్తుంది’ అన్నారు.
రచయిత దర్శకుడు బివిఎస్ రవి మాట్లాడుతూ.. అల్లరి నరేష్ ప్రతి తెలుగింట్లో కుర్రాడి లాంటి యాక్టర్. నరేష్ అభిమాని కాని ఇల్లు వుండదు. అంత ఇష్టం నరేష్ అంటే. ఎవరికి ఏ ఎమోషన్ వచ్చిన సరదాగా నవ్వుకోవడానికి నరేష్ సినిమాలు చూస్తుంటారు. ఫారియా తెలుగమ్మాయి. తన కామెడీ టైమింగ్ అద్భుతంగా వుంది. మల్లికి ఆల్ ది బెస్ట్. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’ అని కోరారు
చిత్ర నిర్మాత రాజీవ్ మాట్లాడుతూ.. నా ప్రయాణంలో నన్ను సపోర్ట్ చేసిన నా కుటుంబానికి ధన్యవాదాలు. మల్లిగారు కథ చెప్పినప్పుడు నా మైండ్ లో నరేష్ గారే వచ్చారు. ఈ సినిమా ఆయన చేయడం మా అదృష్టం. ఈ సినిమాని చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అబ్బూరి రవిగారు రైటింగ్ తో పాటు ఎమోషనల్ గా చాలా సపోర్ట్ చేశారు. ఫారియా చాలా అద్భుతంగా నటించారు. వెన్నెల కిశోర్, హర్ష, జామి లివర్ ఇలా నటీనటులంతా చాలా చక్కని ప్రతిభ కనబరిచారు. ఈ సినిమాకి పని చేసిన టెక్నికల్ టీం అందరికీ ధన్యవాదాలు. ఇది మా మొదటి సినిమా. ఎక్కడా రాజీపడకుండా చాలా క్యాలిటీగా నిర్మించాం. కామెడీ లో నరేష్ గారిని మించి ఎవరూ లేరు. నరేష్ గారి చాలా ఐడియాలు సినిమాలో వున్నాయి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి ధన్యవాదాలు. ఈ వేడుకకు అతిధులుగా వచ్చిన అందరికీ ధన్యవాదాలు. సునీల్ నారంగ్ గారు, సురేష్ బాబు గారు చాలా సపోర్ట్ చేశారు. అందరినీ అలరించే సినిమా ఇది. తప్పకుండా థియేటర్స్ లో చూడండి’ అని కోరారు
జామి లివర్ మాట్లాడుతూ.. అందరినీ నమస్కారం. ఒక తెలుగు సినిమా చేయాలనేది నా డ్రీం. ఆ కల ఈ సినిమాతో తీరినందుకు ఆనందంగా వుంది. ఇలాంటి మంచి కామెడీ ఎంటర్ టైనర్ తో తెలుగులో లాంచ్ కావడం సంతోషంగా వుంది. నరేష్ గారి ధన్యవాదాలు. మల్లి గారు, రాజీవ్ గారికి, టీం అందరికీ ధన్యవాదాలు’ తెలిపారు.
డైరెక్టర్ విజయ్ కనకమేడల మాట్లాడుతూ.. రాజీవ్ గారు చాలా పాషన్ తో క్యాలిటీగా ఈ సినిమా చేశారు. నరేష్ ఫారియా జోడి చూడటానికి చాలా బావుంది. విజువల్స్ చాలా బ్యూటీఫుల్ గా వున్నాయి. మల్లి క్యాలిటీ ఫిల్మ్ తీశాడు. నాంది సినిమాతో నరేష్ గారు నన్ను దర్శకుడిగా నిలబెట్టారు. ఈ వేడుకకు రావడం చాలా అనందంగా వుంది. ఈ సినిమాతో ‘అల్లరి’ నరేష్ గారు ఈజ్ బ్యాక్. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ విజయ్ బిన్నీ మాట్లాడుతూ.. రాజీవ్ గారు చాలా పాషన్ వున్న నిర్మాత. మల్లి గారు చాలా అద్భుతంగా ఈ సినిమా చేశారు. నరేష్ నాగు నా అంజి. నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ దేవాకట్టా మాట్లాడుతూ.. నరేష్ నా మనసు చాలా దగ్గరైన స్నేహితుడు. నేను గౌరవించే విలక్షణ నటుడు నరేష్. తన ప్రయాణం ఇలానే వెర్సటైల్ గా సాగాలి. ఫారియా చాలా పెద్ద స్టార్ అవుతుంది. ఈ సినిమా సుడిగాడు లాంటి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు.
రైటర్ అబ్బూరి రవి మాట్లాడుతూ.. పెళ్లి అనేది పవిత్రమైనది. జీవితాన్ని ఆనందంగా వుంచేది. అలాంటి పెళ్లి చుట్టూ ఎన్ని మోసాలు జరుగుతున్నాయో చూపించే ప్రయత్నం ఈ సినిమా ద్వారా చేశాం. కొందరి కారణంగా పెళ్లి ఆనందానికి చిల్లు పడుతుంది. అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సరదా గా చెప్పే ప్రయత్నం ఈ సినిమా. నవ్వు ఎమోషన్ రెండూ ప్రేక్షకులు ఎక్స్ పీరియన్స్ చేస్తారు. అందరికీ నచ్చే సినిమా ఇది. కుర్రాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా’ అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…