యూత్‌ఫుల్ అండ్ రొమాంటిక్ మూవీ “లెహరాయి” ట్రైలర్ విడుదల,డిసెంబర్ 9న విడుదలకానున్న చిత్రం
తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్న నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో యంగ్ టాలెంటెడ్ హీరో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లెహరాయి.
ఈ ప్రాజెక్ట్ ను S.L.S మూవీస్ ప్రొడక్షన్ నిర్మిస్తుంది .ధర్మపురి ఫేమ్ గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్ మరియు అలీ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తుండగా, రామకృష్ణ పరమహంస ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమా అందరి హృదయాలను ఆకట్టుకుంది. ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
ఇటీవల ప్రమోషన్ టూర్‌లు సినిమాకు పెద్ద ఊపునిచ్చాయి. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈరోజు యూత్‌ఫుల్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ సినిమా ఓ యువ జంట కథ అని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. హీరోయిన్ కాలేజీలో చాలామందితో ప్రొపోజల్స్ అందుకుంటుంది. వాటినుంచి తప్పించుకోవడానికి ఆమె ఉద్దేశపూర్వకంగా హీరోకి ఐ లవ్ యు అని చెబుతుంది, అయితే ఆమె తండ్రి తన కుమార్తెపై ఎక్కువ ప్రేమను చూపిస్తుంటాడు. ఉద్దేశపూర్వకంగా చెప్పడం వలన తండ్రి కూతుర్లు ఏమి చేసారు.? కథ ఎటువంటి మలుపులు తిరిగిందని యూత్ ను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తుంది.
యూత్ ను దృష్టిలో పెట్టుకుని సాగే డైలాగులు రంజిత్, సౌమ్య మీనన్ మధ్య సాగే సంభాషణలు యూత్ ను అలరిస్తాయి. ఫన్ పోర్షన్ కూడా బాగుంది. ట్రైలర్‌కి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాప్ట్‌గా ఉంది. పూర్తి భావోద్వేగాలు, వినోదం మరియు ప్రేమతో నిండిన ఈ యూత్‌ఫుల్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. డిసెంబర్ 9న సినిమా విడుదలవుతోంది.