టాలెంటెడ్ హీరో లెజెండ్ శరవణన్ “లీడర్” సినిమా గ్లింప్స్ రిలీజ్, ఏప్రిల్ లో గ్రాండ్ రిలీజ్ కు రాబోతున్న మూవీ

లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “లీడర్”. ఈ చిత్రాన్ని లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. దర్శకుడు ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. “లీడర్” సినిమా ఏప్రిల్ లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు.

పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో వచ్చిన “లీడర్” గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఈ గ్లింప్స్ ఎలా ఉందో చూస్తే – విలన్ కు చెందిన 9 కంటెయినర్లు కనిపించకుండా పోతాయి. ఆ కంటెయినర్స్ కోసం విలన్ అనుచరులు వెతుకుతుంటారు. ఒక చోట 9 కంటెయినర్లు కనిపిస్తాయి. కానీ ఆ కంటెయినర్స్ డ్రైవర్స్, రౌడీలు చనిపోయి ఉంటారు. వాళ్లను వెతుక్కుంటూ వచ్చిన రౌడీలను కూడా హీరో మట్టుబెడతాడు. ఎవరు చంపారని ఆరా తీస్తే అక్కడ ఉన్న అమ్మాయి వాళ్ల నాన్న అని తెలుస్తుంది. ఏరా నువ్వు హీరోవా అని విలన్ ఫోన్ చేసి అడిగితే, అవును హీరోనేరా ఏ బిడ్డకైనా తండ్రే హీరోరా అనే డైలాగ్ తో గ్లింప్స్ ఆకట్టుకుంది.

ఈ సినిమా గురించి దర్శక నిర్మాతలు మాట్లాడుతూ – కొన్ని అనుకోని పరిస్థితుల్లో అండర్ వరల్డ్ మాఫియా, పోలీసుల ఫోర్స్ మధ్య చిక్కుకున్న ఓ సాధారణ వ్యక్తి కథ ఇది. ఈ రెండు వర్గాల సంఘర్షణ మధ్య తనని తాను రక్షించుకుంటూ ఈ సాధారణ వ్యక్తి ఎలా బయటపడ్డాడు అనేది ఆద్యంత ఆసక్తికరంగా ఈ సినిమాలో ప్రేక్షకులు చూడబోతున్నారు. అని తెలిపారు.

కోడి, పట్టాస్, గరుడన్ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ “లీడర్” చిత్రాన్ని ఒక మంచి ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జైపూర్, ఊటీ, జార్జియా, చెన్నై వంటి లొకేషన్స్ లో మాస్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించారు. త్వరలోనే ఈ చిత్ర ఆడియోను విడుదల చేయబోతున్నారు.

నటీనటులు – పాయల్ రాజ్ పుత్, శ్యామ్, ఆండ్రియా, సంతోష్ ప్రతాప్, లాల్, బాహుబలి ప్రభాకర్, అమృత అయ్యర్, వీటీవీ గణేష్, ఐశ్వర్య, అరంతంగి నిశా, ఐయాల్, జయమిశ్రా, పత్మాన్, యోగిరామ్, ఓక్ సుందర్, మహానది శంకర్, మరియమ్ జార్జ్, ఆదిత్య కతియార్, వేల్ అరుణాచలం, నిరంజన్, శోభన్ బాబు, అశోక్ పాండియన్, తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్ డిజైనర్ – దీప్తి ఆర్.జి, పూర్తి ప్రవీణ్
ఆర్ట్ డైరెక్షన్ – జి.దురైరాజ్
స్టంట్స్ – మహేశ్ మాథ్యూ
ఎడిటింగ్ – ప్రదీప్ ఇ.రాఘవ్
సినిమాటోగ్రఫీ – ఎస్. వెంకటేష్
మ్యూజిక్ – జిబ్రాన్ వైభోద
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
బ్యానర్ – లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్
స్టోరీ, డైరెక్షన్ – ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్

TFJA

Recent Posts

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ బోలెడన్ని ట్విస్టులతో ఉంటుంది.. ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…

16 hours ago

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) కి యువ నిర్మాత వంశీ నందిపాటి విరాళం

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…

1 day ago

మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ”ఓం శాంతి శాంతి శాంతిః”

సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…

1 day ago

బుక్ మై షోలో 100కె టికెట్ బుకింగ్స్ క్రాస్ చేసిన బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ మూవీ “కపుల్ ఫ్రెండ్లీ”

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…

1 day ago

మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…

1 day ago

“అరుణాచల గిరి ప్రదక్షిణ”ఫస్ట్ గ్లిమ్ప్స్ ఆవిష్కరించినప్రఖ్యాత నటులు తనికెళ్ళ!!

"ఆటగదరా శివా" అంటూ శివతత్వాన్ని ఆవిష్కరించిన ప్రముఖ నటుడు - రచయిత- దర్శకుడు తనికెళ్ళ భరణి… సుప్రసిద్ధ మహిమాన్విత పుణ్యక్షేత్రం…

2 days ago