ఇండియ‌న్ ఫుట్‌బాల్ లెజండ్ గురించి తెలుసుకోవాలంటే మైదాన్ ఫైన‌ల్ ట్రైల‌ర్‌ని చూడాల్సిందే!

ఏడాదికి క‌నీసం ఒక్క హిట్ అయినా లేకుండా ఆయ‌న కెరీర్ గ‌డ‌వ‌లేదు. సినిమా హీరోల్లో ఈ అరుదైన ఘ‌న‌త ఉన్న హీరో అజ‌య్ దేవ్‌గ‌ణ్‌. ఆయ‌న పుట్టిన‌రోజు ఇవాళ‌. అజ‌య్‌దేవ్‌గ‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మైదాన్ సెన్సేష‌న‌ల్ ఫైన‌ల్ ట్రైల‌ర్‌ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. ఒక‌టా, రెండా ఎన్నెన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొన్న లెజండ‌రీ కోచ్ ఎస్‌.అబ్దుల్ ర‌హీమ్‌, ఆయ‌న ఇండియ‌న్ ఫుట్‌బాల్ టీమ్ గురించి ఈ ట్రైల‌ర్ మ‌రింత అద్భుతంగా ఆవిష్క‌రించింది. ఫుట్‌బాల్ రంగంలో మ‌న ఇండియా టీమ్… చ‌రిత్ర‌ను ఎలా తిరగ‌రాసిందో చెప్పే చిత్ర‌మే మైదాన్‌.
ప్ర‌తి ఒక్క‌రూ అనుస‌రించాల్సిన అంకిత భావం, అచంచ‌ల‌మైన విశ్వాసం, ఫుట్‌బాల్ రంగంలో వెలుగులు చాటాల‌నే త‌ప‌న‌తో ముంద‌డుగేసి, రాణించి మ‌న దేశానికి గ‌ర్వ‌కార‌ణంగా నిలిచిన లెజండ‌రీ కోచ్ స‌య్య‌ద్ అబ్దుల్ ర‌హీమ్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.


అమిత్ ర‌వీంద్ర‌నాథ్ శ‌ర్మ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆద‌ర్శ‌వంత‌మైన ఈ స్పోర్ట్స్ బ‌యోపిక్‌లో ప్రియ‌మ‌ణి, గ‌జ్‌రాయ్ రావు, బెంగాలీ యాక్ట‌ర్ రుద్ర‌నీల్ ఘోష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.
జీ స్టూడియోస్‌, బోనీ క‌పూర్‌, అరుణ‌వ జోయ్ సేన్‌గుప్తా, ఆకాష్ చావ్లా నిర్మించారు. సైవిన్ ఖుద్రాస్, రితీష్ షా స్క్రీన్ ప్లే, డైలాగులు రాశారు. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని స‌మ‌కూర్చారు. మ‌నోజ్ ముంత‌షిర్ శుక్లా లిరిక్స్ రాశారు. ఈద్ సంద‌ర్భంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏప్రిల్ 10న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు మేక‌ర్స్. ఐమ్యాక్స్ వెర్ష‌న్ కూడా అదే రోజున విడుద‌ల కానుంది.

Tfja Team

Recent Posts

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…

1 week ago

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

2 weeks ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

2 weeks ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

2 weeks ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

2 weeks ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

2 weeks ago