సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజపుత్, ఐశ్వర్య రాజీవ్ కనకాల కీలక పాత్రధారులుగా శాంతి కుమార్ తూర్లపాటి (జబర్దస్ట్ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’. ఈ చిత్రం ‘ఓసిని వయ్యారి రామ చిలుక’ అంటూ సాగే లిరికల్ వీడియోను ఆది సాయికుమార్ విడుదల చేసారు.
ఆది మాట్లాడుతూ ‘‘ఈ మధ్యన నాన్న కథల ఎంపికలో ఆచితూచి అడుగేస్తున్నారు. ఇందులో అయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫీల్ గుడ్ సినిమా అని, తన పాత్ర కొత్తగా ఉంటుందని నాన్న చెప్పారు. మంచి కథ ఉంటే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. తాజాగా విడుదల చేసిన పాట నాకు బాగా నచ్చింది. లిరిక్స్ అర్థవంతంగా ఉన్నాయి. సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నా” అని అన్నారు.
‘‘జబర్దస్త్ కమెడీయన్‌గా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశాను. కథ, మాట, పాటలు నేనే రాసుకుని చక్కని నిర్మాతల సహకారంతో ఈ సినిమా పూర్తి చేశాం. బిజీలో కూడా ఆది గారు మా సాంగ్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఇందులో సాయి కుమార్ పాత్ర కొత్తగా ఉంటుంది. కొన్ని సన్నివేశాల్లో అయన పాత్ర ఏడిపించేంత ఎమోషనల్ గ ఉంటుంది” అని దర్శకుడు చెప్పారు.
“మంచి కథతో తొలి ప్రయత్నం చేసాం. సాయి కుమార్ గారు కొత్తగా కనిపిస్తారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని నిర్మాత చెప్పారు.
నటీనటులు:
సమీర్, సి.వి.ఎల్ నరసింహారావు, గౌతమ్ రాజు ఎమ్మెస్ చౌదరి, భద్రం, సుమన్ శెట్టి తదితరులు
సాంకేతిక నిపుణులు:
కెమెరా: యూ’హ్. మురళి మోహన్ రెడ్డి, సంగీతం: సత్య కశ్యప్, బ్యాక్గ్రౌండ్: ఎస్ చిన్న, ఎడిటింగ్: నందమూరి హరి, ఆర్ట్: పెద్దిరాజు అడ్డాల, పాటలు: రామజోగయ్య శాస్త్రి, శాంతికుమార్, కొరియోగ్రాఫర్: భాను, చంద్ర కిరణ్, ఫైట్స్: నందు, బ్యానర్:శ్రీ భావనేశ్ ప్రొడక్షన్స్, సమర్పణ: ఎల్లలు బాబు టంగుటూరి, పీఆర్వో: మధు విఆర్
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…