టాలీవుడ్

లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ ‘మేమ్ ఫేమస్’ థర్డ్ సింగిల్

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ లాంచ్ చేసిన లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ ‘మేమ్ ఫేమస్’ థర్డ్ సింగిల్ దోస్తులం

లహరి ఫిలింస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ నుంచి వస్తోన్న రెండవ చిత్రం ‘మేమ్ ఫేమస్’. ఇప్పటికే ప్రామెసింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో టీం బజ్  క్రియేట్ చేసింది. తాజాగా దర్శకుడు తరుణ్ భాస్కర్ థర్డ్ సింగిల్ దోస్తులం పాటని లాంచ్ చేశారు.

దోస్తులం.. స్నేహం, ఒకరితో ఒకరు మంచిగా ఉండటంలో వున్న గొప్పతనాన్ని వివరించే పాట. గుడ్ టైం ని సెలబ్రేట్ చేసుకొని, చెడు సమయాల్లో సహాయాన్ని అందించేది ఫ్రండ్షిప్. కళ్యాణ్ నాయక్ ఈ బ్యూటీఫుల్ సాంగ్ ని స్వరపరిచి, కోటి మామిడాలతో పాటు సాహిత్యం కూడా రాశారు. కాల భైరవ పాటను మెస్మరైజ్ చేసేలా ఆలపించారు.

ఈ పాటలో డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి. కళ్యాణ్ నాయక్ చక్కని కంపోజిషన్‌ చేశారు. సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి మంచి స్నేహితులు. ఈ పాట ఒకరితో ఒకరు సన్నిహిత బంధాన్ని తెలిజేస్తుంది.విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాని సుమంత్ ప్రభాస్ స్వయంగా రచించి, దర్శకత్వం వహించగా, అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి శ్యామ్ దూపాటి సినిమాటోగ్రాఫర్, సృజన అడుసుమిల్లి ఎడిటర్. అరవింద్ మౌళి ఆర్ట్ డైరెక్టర్.

రేపు హైదరాబాద్‌లోని క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో జరగనున్న ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమానికి నేచురల్‌ స్టార్‌ నాని హాజరుకానున్నారు.

అల్లు అరవింద్‌ గీతా ఆర్ట్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనుంది.

మే 26న మేమ్ ఫేమస్ సినిమా థియేటర్లలోకి రానుంది.

తారాగణం: సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాశి, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్, కిరణ్ మచ్చ, అంజిమామ, శివ నందన్

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: సుమంత్ ప్రభాస్
నిర్మాతలు: అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్ర మనోహర్
బ్యానర్లు: చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్
సంగీతం: కళ్యాణ్ నాయక్
డీవోపీ: శ్యామ్ దూపాటి
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
ఆర్ట్: అరవింద్ మూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సూర్య చౌదరి
పీఆర్వో: వంశీ-శేఖర్
క్రియేటివ్  ప్రొడ్యూసర్స్ : ఉదయ్-మనోజ్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

17 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

5 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

5 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago