తొలి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టిన ‘కృష్ణమ్మ’

వెర్స‌టైల్ హీరో స‌త్య‌దేవ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ‘కృష్ణ‌మ్మ‌’. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మించారు. ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాను మే 10న భారీ ఎత్తున‌ విడుదల చేశాయి.  సత్యదేవ్‌లోని నటుడిని కొత్తగా ఆవిష్కరించిన చిత్రంగా కృష్ణమ్మ మనన్నలు అందుకుంటోంది. సినిమాలో సత్యదేవ్ రగ్డ్ లుక్, రస్టిక్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టి పడేశాయి

సత్యదేవ్ సినీ కెరీర్లో ‘కృష్ణమ్మ’ సినిమా ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. తొలి రోజునే 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను సినిమా రాబట్టుకుంది. ఓ వైపు ఎన్నికలు, మరో వైపు ఐపీఎల్ క్రికెట్ ఫీవర్ నేపథ్యంలో విడుదలైన ‘కృష్ణమ్మ’కు మంచి కలెక్షన్స్ రాబట్టుకోవటం మంచి పరిణామం. సత్యదేవ్ కెరీర్ లో బెస్ట్ మూవీ ఓపెనింగ్ కలెక్షన్స్ ఇవే.

‘కృష్ణమ్మ’ సినిమాకు ఇటు ప్రేక్షకుల నుంచే కాదు, అటు విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. మంచి మౌత్ వచ్చింది. దీంతో సినిమా మంచి వసూళ్లను రాబట్టుకుంది. మే నెలాఖరు వరకు పెద్దగా రిలీజెస్ లేనందు వల్ల కృష్ణమ్మ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధిస్తుందనటంలో సందేహం లేదు. ప్రేక్షకులను చక్కటి యాక్షన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటూ థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది కృష్ణమ్మ.

‘కృష్ణమ్మ’ సినిమాలో స్నేహం, ప్రేమ వంటి అంశాలతో మిళితమైన  యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తున్నాయి. సత్యదేవ్ తో పాటు లక్ష్మణ్ మీసాల, రఘు కుంచె, అతీరా రాజ్ కీలక పాత్రల్లో నటించారు. కాలభైరవ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ అందించారు.

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “చిరంజీవి” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా "చిరంజీవి". ఈ చిత్రంలో తనికెళ్ల భరణి,ఈశ్వరీ రావు, గోపరాజు రమణ,శ్రీకాంత్…

10 hours ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 day ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

5 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

5 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago