కథాకేళి నుండి రెండవపాటగా ‘‘కొత్తగా ఓ రెండు తారలే’’..

Must Read

ఈషా రెబ్బ, అనన్య నాగళ్ల, నందిని రాయ్, దినేశ్‌ తేజ్, అజయ్‌ కతుర్వార్, యశ్విన్‌ వేగేశ్నలు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘కథాకేళి’. చింతా గోపాలకృష్ణా రెడ్డి సమర్పణలో శతమానం భవతి ఆర్ట్స్, యం.ఎస్‌ వారాహి క్రియేషన్స్‌ పతాకాలపై నేషనల్‌ అవార్డు విన్నర్‌ సతీష్‌ వేగేశ్న స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు నిర్వహించుకుంటుంది. అజయ్, అనన్య నాగళ్లపై చిత్రీకరించిన ‘‘కొత్తగా ఓ రెండు తారలే’’ అంటూ సాగే ఈ పాటను స్టార్‌ సింగర్‌ కోయిలమ్మ చిత్రగారు ఆలపించటంతో సినిమాకు మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది.

చిత్రయూనిట్‌ సోమవారం ఈ పాటను సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేసింది. ఈ చిత్రంలో భానుశ్రీ, ఆయుషి పటేల్, పూజా ఝవేరి, విరాట్, రవివర్మ గూడూరి, ప్రవీణ్, ప్రభు, జెమిని సురేశ్, చింటు, రచ్చ రవి, ముక్కు అవినాష్, భద్రం, జబర్ధస్త్‌ నాగి, ఉషశ్రీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సౌండ్‌ డిజైన్‌– జి.పురుషోత్తం రాజు, ఎడిటింగ్‌– మధు, లిరిక్స్‌– శ్రీమణి, వేగేశ్న సతీష్, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌– ఆవుల యాదగిరి, చీఫ్‌ కో డైరెక్టర్‌– నరేంధ్రవర్మ మంతెన, ప్రొడక్షన్ డిజైనర్‌ – రామాంజనేయులు, సంగీతం– ఎస్‌.కె.బాలచంద్రన్, కెమెరా– దాము నర్రావుల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌– వేగేశ్న ప్రదీఫ్‌ రాజ్, కో– ప్రొడ్యూసర్స్‌ – ముని శివ, ఎ.సతీష్‌ రెడ్డి రచన–దర్శకత్వం సతీష్‌ వేగేశ్న

Latest News

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. "వానర" చిత్రాన్ని...

More News