ఎస్ ఎన్ ఆర్ ఫిల్మ్స్ “కిస్ మి”

Must Read

ఎం ఏ చౌదరి దర్శకత్వంలో ఎస్ ఎన్ ఆర్ ఫిల్మ్స్ పతాకంపై సునీల్ మారిశెట్టి నిర్మిస్తున్న చిత్రం “కిస్ మి”. ఈ సందర్భంగా నిర్మాత మారిశెట్టి సునీల్ మాట్లాడుతూ ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టుగా యూత్ ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు కథ రెడి చేశారు. ఇది మా బ్యానర్లో మూడో చిత్రం. ఈ కథ హైలైట్ అవుతుంది.

ఆగస్టు మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది అన్నారు. దర్శకుడు ఎమ్ ఏ చౌదరి మాట్లాడుతూ ఈ చిత్రం లోనూతన నటీనటులు నలుగురు హీరోలు, నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఒక హీరోయిన్ గా పూర్విక ను సెలెక్ట్ చేసాము. ముఖ్యంగా ప్రముఖ హీరోయిన్ మా చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. శ్రీలంక కు చెందిన ప్రముఖ హీరోయిన్ ని ఇప్పటికే కన్ఫర్మ్ చేసాము.ఇతర ఆర్టిస్టు ల వివరాలు త్వరలోనే తెలియచేస్తాము అన్నారు. ప్రాజక్ట్ ఇంచార్జ్: అజిత్, సంగీతం: రాజు, మూలకథ: అహ్మద్, డాన్స్: రాజుసుందరం, ఫైట్స్: విజయన్, నిర్మాత: మారిశెట్టి సునీల్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎం ఏ చౌదరి.

Latest News

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల వైవిధ్యమైన...

More News