యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరక్ వివాహం గురువారం రాత్రి కర్ణాటకలోని కూర్గ్ లో ఘనంగా జరిగింది. కూర్గ్ లోని ఓ రిసార్ట్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితులైన మిత్రుల సమక్షంలో వీరి వివాహ వేడుకలు జరిగాయి. కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ వివాహ వేడుకల ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
సినీ ప్రియులు, చిత్ర పరిశ్రమకు చెందిన మిత్రులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ లు చేస్తున్నారు. రాజావారు రాణిగారు సినిమాలో కలిసి నటించిన కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్… ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే పరస్పరం ఇష్టపడ్డారు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.
కిరణ్ అబ్బవరం ప్రస్తుతం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ “క” లో నటిస్తున్నారు. ఈ త్వరలోనే ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోంది.