కిచ్చా సుదీప్ యాక్షన్ ప్యాక్డ్ ‘మ్యాక్స్’ ట్రైలర్ విడుదల

Must Read

/

మ్యాక్స్‌తో మాట్లాడేటప్పుడు మ్యాగ్జిమమ్ సైలెన్స్ మైంటైన్ చేయాలి… పవర్ ఫుల్ యాక్షన్ & పంచ్ డైలాగులతో ‘కిచ్చా’ సుదీప్ ‘మ్యాక్స్’ ట్రైలర్ రిలీజ్


కన్నడ స్టార్ ‘కిచ్చా’ సుదీప్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘మ్యాక్స్’. వెర్సటైల్ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్, పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన టాలీవుడ్ నటుడు సునీల్, ‘అఖండ’ ఫేమ్ శరత్ లోహితస్య కీలక పాత్రల్లో నటించారు. వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ సంస్థలపై కోలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 27న ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. 

‘మా పొలిటికల్ కెరీర్ కి ఈ రాత్రి చాలా ఇంపార్టెంట్’ అని వాయిస్ ఓవర్‌లో డైలాగ్ వస్తుండగా ట్రైలర్ మొదలైంది. ‘అఖండ’తో పాటు తెలుగు సినిమాలు కొన్నిటిలో నటించిన శరత్ లోహితస్యను చూపించారు. ఆయన పొలిటికల్ లీడర్ క్యారెక్టర్ చేసినట్టు అర్థం అవుతోంది. ఆ తర్వాత సునీల్ క్యారెక్టర్ పరిచయం చేశారు. ఆయన బ్రూటల్ విలన్ రోల్ చేశారని అర్థం అవుతోంది. ఓ మనిషిని సునీల్ క్రూరంగా నరికినట్టు చూపించారు. ఆ తర్వాత తమ కూతురు మిస్సింగ్ అని ఓ తల్లి కన్నీరు పెట్టుకుంటుంది. బైకర్ గ్యాంగ్స్, విలన్స్, పోలీస్… ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ అయ్యింది. వరలక్ష్మి శరత్ కుమార్ పోలీస్ రోల్ చేశారు. 

‘చావు ఎదురొచ్చినా సరే మా అబ్బాయి ఒంటరిగా నిలబడి పోరాడతాడు’ అని హీరో మదర్ డైలాగ్ చెప్పిన తర్వాత కిచ్చా సుదీప్ ఎంట్రీ అదిరింది. ఆయన యాక్షన్ ప్యాక్డ్, పవర్ ఫుల్ రోల్ చేసినట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. యాక్షన్ సీక్వెన్సుల్లో ఆయన హీరోయిజం సింప్లీ సూపర్బ్. ‘ఈ ఒక్క రోజు రాత్రి స్వచ్ఛ భారత్’ కార్యక్రమం చేపడదాం’, ‘సేవ పేరుతో రాజకీయాల్లోకి వచ్చే ప్రతి పకోడీ గాడు సమాజ సేవకుడే. మొత్తం క్లీన్ చేసి పారేద్దాం’ డైలాగులు ట్రైలర్ స్టార్టింగులో కనిపించిన పొలిటికల్ లీడర్లను టార్గెట్ చేశాయని అర్థం అవుతుంది. ‘మ్యాక్స్‌తో మాట్లాడేటప్పుడు మ్యాగ్జిమమ్ సైలెన్స్ ఉండాలి’ అని ట్రైలర్ చివర్లో సుదీప్ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ అందరికీ సూపర్ కిక్ ఇస్తుంది. 

నటీనటులు:
కిచ్చా సుదీప్, వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్, సంయుక్త హార్నడ్, సుకృతి వాగల్, అనిరుధ్ భట్, తదితరులు

టెక్నికల్ టీమ్:
సినిమాటోగ్రఫీ – శేఖర్ చంద్ర
ఎడిటింగ్ – ఎస్ఆర్ గణేష్ బాబు
డైలాగ్స్: ఆశ్లేషా
లిరిక్స్: గోసాల రాంబాబు
మ్యూజిక్ – అజనీష్ లోకనాథ్
బ్యానర్స్ – వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్
నిర్మాత – కలైపులి ఎస్.థాను
దర్శకత్వం – విజయ్ కార్తికేయ

Latest News

Naa Swase Nuvvai Song sung by Hero Siddharth from It’s Okay Guru released

Charan Sai and Usha sri are playing the lead roles in the upcoming movie It's Okay Guru, produced by...

More News