కేవీఎన్ ప్రొడక్షన్ అధినేత వెంకట్‌కి సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది కాబట్టే ‘కేడీ ది డెవిల్’ చిత్రాన్ని ఇంత గొప్పగా నిర్మించారు.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో సంజయ్ దత్
‘కేడీ ది డెవిల్’ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ధృవ సర్జా
కన్నడ యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా హీరోగా కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మాత వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ ఎత్తున నిర్మించిన చిత్రం ‘కేడీ ది డెవిల్’. ఈ సినిమాను ప్రేమ్ తెరకెక్కించారు. ఈ మూవీలో ధృవ సర్జాకు జోడిగా రీష్మా నానయ్య నటించారు. ఇక ఈ ప్రాజెక్ట్‌లో సంజయ్ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతేహి వంటి వారంతా ముఖ్య పాత్రల్ని పోషించారు. గురువారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో..
సంజయ్ దత్ మాట్లాడుతూ .. ‘హైదరాబాద్‌తో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఇక్కడ ఎంతో మందితో కలిసి పని చేశాను. మరీ ముఖ్యంగా నాకు హైదరాబాద్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. నేను ప్రభాస్ రాజా సాబ్ సినిమాకు పని చేస్తున్నాను. అక్కడే తెలుగు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. నాకు తెలుగులో చిరంజీవి గారంటే చాలా ఇష్టం. కేవీఎన్ ప్రొడక్షన్స్ వెంకీ సర్, సుప్రిత్‌లకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. అందుకే ఇలాంటి మూవీని ఇంత గొప్పగా నిర్మించగలిగారు. డైరెక్టర్ ప్రేమ్ చాలా మంచి వ్యక్తి. ఆయన ఎంతో ఒదిగి ఉంటారు. రీష్మా చాలా చక్కగా నటించారు. ధృవ్ నా తమ్ముడులాంటివారు. ధృవ చాలా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. శిల్పా శెట్టితో ఎప్పుడు పని చేసినా అదే ఎనర్జీ ఉంటుంది. మా సినిమాను అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
ధృవ సర్జా మాట్లాడుతూ .. ‘‘కేడీ’ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా కెమెరామెన్ విలియం, మా నిర్మాత వెంకట్, సుప్రిత్, మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ అందరికీ ధన్యవాదాలు. నాకు సంజయ్ దత్ గారు అంటే ఎంతో ఇష్టం. ఆయనతో పని చేయడం ఆనందంగా ఉంది. శిల్పా శెట్టి వంటి యాక్టర్లతో పని చేయడం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. సెట్స్ మీద ఆమె మా యాక్టింగ్‌ను కరెక్ట్ చేస్తుంటారు. రీష్మా మంచి నటి. మా మూవీ త్వరలోనే రాబోతోంది. అందరూ చూడండి. అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.
దర్శకుడు ప్రేమ్ మాట్లాడుతూ .. ‘‘కేడీ ది డెవిల్’ టీజర్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తే నాకు మాటలు రావడం లేదు. నాకు కన్నడ మాత్రమే వచ్చు. తెలుగు అర్థం అవుతుంది. కానీ మాట్లాడటానికి రాదు. జోగి అని నేను కన్నడలో తీస్తే తెలుగులో ఇక్కడ యోగి అంటూ చేశారు. కానీ అప్పుడు రీమేక్ చేయమని అడిగారు. కానీ నాకు భాష తెలీదు కదా అని చేయలేను అని చెప్పాను. నేను తెలుగులో ఎక్కువగా చిత్రాలు చూస్తుంటాను. చిరంజీవి గారి ఇంటికి తరుచుగా వెళ్తుంటాం. ఇప్పుడు నేను ‘కేడీ’ చిత్రంతో రాబోతోన్నాను. టీజర్ ఆల్రెడీ అందరినీ ఆకట్టుకుంటోంది. నా ఫ్రెండ్, ఫ్యామిలీ పర్సన్ ధృవ సర్జా నాకు ఈ ప్రయాణంలో అండగా నిలిచారు. కాళిదాసు పాత్రలో ఎంతో ఎమోషన్ ఉంటుంది. ధృవ ఈ కారెక్టర్‌ను అద్భుతంగా పోషించారు. ఈ పాత్రను ఒప్పుకున్న సంజూ బాబాకి థాంక్స్. నేను ఆయనకు చాలా పెద్ద అభిమానిని. చిత్రీకరణ సమయంలో శిల్పా శెట్టి గారు ఎంతో సహకరించారు. రీష్మా టాలెంటెడ్ వ్యక్తి. ఈ మూవీ ఆడియెన్స్ రైట్స్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. అందరికీ ఈ చిత్రం నచ్చుతుందని భావిస్తున్నా’ అని అన్నారు.
శిల్పా శెట్టి మాట్లాడుతూ .. ‘హిందీలో కాకుండా నేను మొదటగా తెలుగులో సినిమాను చేశాను. సాహసవీరుడు సాగర కన్య అని సినిమాను చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు వారు నాపై అదే ప్రేమను చూపిస్తున్నారు. సత్యవతి పాత్రను నాకు ఇచ్చిన డైరెక్టర్ ప్రేమ్ గారికి థాంక్స్. కేవీఎన్ వెంకట్ గారికి సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉంది. ధృవ, రీష్మాలతో పని చేయడం సంతోషంగా ఉంది. సంజయ్ దత్ గారితో నేను చేసిన ప్రతీ సినిమా హిట్ అయింది. అదే ట్రెండ్ ఇప్పుడు కంటిన్యూ అవుతుందని భావిస్తున్నాను. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను. ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ అంశాలున్నాయి. ఈ మూవీని ప్రేమ్.. ఎంతో ప్రేమతో తెరకెక్కించారు’ అని అన్నారు.
రీష్మా నానయ్య మాట్లాడుతూ .. ‘నేను మొదటి సారిగా యూఐ ప్రమోషన్‌కు ఇక్కడకు వచ్చాను. మళ్లీ ఇప్పుడు కేడీ మూవీ కోసం వచ్చాను. మీ అందరికీ టీజర్ నచ్చిందని భావిస్తున్నాను. ఈ మూవీ నాకెంతో ప్రత్యేకం. ఈ చిత్రంలో అన్ని పాత్రలు డిఫరెంట్‌గా, యూనిక్‌గా ఉంటుంది. చాలా కొత్త సబ్జెక్ట్‌తో ఈ చిత్రం రాబోతోంది. ఇంత భారీ క్యాస్టింగ్‌తో వచ్చిన చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన ప్రేమ్ గారికి థాంక్స్. అక్షిత మేడం, ప్రేమ్ సర్‌లు నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వాళ్లే నా గురువులు. సంజయ్ దత్ గారు చాలా మంచి వ్యక్తి. మనం చెప్పేవన్నీ ఆయన ఓపికతో వింటారు. శిల్పా శెట్టి మేడం సెట్స్ మీదకు ఓ ఎనర్జీని తీసుకు వచ్చేవారు. ఆమెను చూసి నేను ఎంతో నేర్చుకున్నాను. ధృవ సర్‌తో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన తోటి ఆర్టిస్టుల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తుంటారు. కేవీఎన్ లాంటి భారీ సంస్థలో పని చేయడం ఆనందంగా ఉంది. మా చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.
కేవీఎన్ ప్రొడక్షన్ బిజినెస్ హెడ్ సుప్రిత్ మాట్లాడుతూ .. ‘ముంబైలో టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇంత మంచి మాస్ టీజర్‌ను ఇచ్చిన ప్రేమ్ గారికి థాంక్స్. రేపు కొచ్చి, బెంగళూరు, చెన్నైలో ఈవెంట్లు ప్లాన్ చేశాం. ఎంతో బిజీగా ఉన్నా కూడా మాతో పాటుగా వస్తున్న సంజయ్ దత్ గారికి థాంక్స్. టీజర్‌లో ధృవ సర్ చేసింది చాలా తక్కువ. తెరపై ఆయన అదరగొట్టేస్తారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాత వెంకట్ గారికి థాంక్స్’ అని అన్నారు.
నటీనటులు : ధృవ సర్జా, రీష్మా నానయ్య, వి రవిచంద్రన్, రమేష్ అరవింద్, సంజయ్ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతేహి, యష్ శెట్టి తదితరులు
టెక్నికల్ టీం
బ్యానర్: కెవిఎన్ ప్రొడక్షన్స్
నిర్మాత: కెవిఎన్
దర్శకుడు: ప్రేమ్
హెడ్-బిజినెస్ & కార్యకలాపాలు: సుప్రిత్
DOP: విలియం డేవిడ్
సంగీత దర్శకుడు: అర్జున్ జన్య
ఆర్ట్ డైరెక్టర్: మోహన్ బి కేరె
డైలాగ్స్: క్రాంతి కుమార్
పీఆర్వో : వంశీ కాకా
శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో…
తెలుగు చిత్ర నిర్మాతల మండలి 2026 ఎన్నికలలో మన ప్యానల్, ప్రోగ్రెసివ్ ప్యానల్ పోటీ చేయగా మన ప్యానల్ నుండి…
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…