మార్చి 24న రిలీజ్ అవుతున్న ‘కథ వెనుక కథ’

‘కథ వెనుక కథ’ చాలా పెద్ద హిట్ అవుతుంది:  నిర్మాత అవ‌నీంద్ర కుమార్‌

కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయటానికి ప్రారంభ‌మైన నిర్మాణ సంస్థ దండమూడి బాక్సాఫీస్. ఈ బ్యాన‌ర్‌పై రూపొందిన తొలి చిత్రం ‘కథ వెనుక కథ’. విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభ శ్రీ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రానికి అవ‌నింద్ర కుమార్ నిర్మించారు  సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ సినిమాను మార్చి 24న రిలీజ్ చేస్తున్నారు. సోమ‌వారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. దేశంలో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న‌ నిర్భ‌య త‌ర‌హా ఘ‌ట‌న‌లను ఖండిస్తూ మేక‌ర్స్ ఓ స్పెష‌ల్ వీడియోను విడుద‌ల చేశారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో..

హీరో విశ్వంత్ దుడ్డుంపూడి మాట్లాడుతూ ‘‘నటుడిగా కథ వెనుక కథ నా కెరీర్‌లో మంచి సినిమాగా నిలుస్తుంది. నేను ఎక్కువ‌గా మ‌ల‌యాళ సినిమాలు చూస్తూ పెరిగాను. దీంతో నాపై వాటి ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. అందుక‌నే నేను చేసే సినిమాలు సూప‌ర్ హిట్స్ కాక‌పోయిన‌ప్ప‌టికీ బ్యాడ్ మూవీస్‌గా మాత్రం నిల‌వ‌కూడ‌ద‌ని అనుకున్నాను. అలాంటి ఆలోచ‌న‌తో ఉన్నప్పుడు ‘కథ వెనుక కథ’ సినిమా చేసే అవ‌కాశం క‌లిగింది. నా కెరీర్‌లో ఇదొక ఎక్స్‌పెరిమెంట్ మూవీ. ఇది హీరో డ్రైవింగ్ మూవీ కాదు..కంటెంట్ డ్రైవింగ్ మూవీ. ఈ సినిమాలో ప‌ని చేసిన ప్ర‌తీ ఒక్క‌రికీ థాంక్స్‌. సునీల‌న్నతో ప‌ర్స‌న‌ల్‌గా కూడా మంచి రిలేష‌న్ ఏర్పడింది. అలీగారు మాకెంతో సపోర్ట్ చేశారు. వచ్చి యాక్ట్ చేసి వెళ్లిపోయామా అని కాకుండా ఓ రెస్పాన్సిబుల్‌గా మా సినిమాలో త‌న వంతు పాత్ర‌ను పోషించారు.  నాతో పాటు సినిమాలో న‌టించిన ఇత‌ర న‌టీన‌టుల‌తో పాటు టెక్నీషియ‌న్స్‌కి కూడా థాంక్స్. అవ‌నీంద్ర కుమార్‌గారు చాలా మంచి ప్రొడ్యూస‌ర్‌. ఆయ‌న‌తో ఇంకా ఎక్కువ‌గా సినిమాలు చేయాల‌ని అనుకుంటున్నాను. మార్చి 24 న మా ‘కథ వెనుక కథ’ మూవీ రిలీజ్ అవుతుంది’’ అన్నారు.

నిర్మాత అవ‌నీంద్ర కుమార్ మాట్లాడుతూ ‘‘మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ సాయి వ‌చ్చి.. కృష్ణ చైత‌న్య గురించి చెప్పి క‌థ విన‌మ‌న్నారు. విన‌గానే.. వెంట‌నే నాకు సునీలే గుర్తుకు వ‌చ్చారు. ఎందుకంటే మంచి క‌థ దొరికితే సినిమా చేస్తాన‌ని అంత‌కు ముందు ఓసారి ఆయ‌న‌కు చెప్పాను. ‘కథ వెనుక కథ’ విన‌గానే సునీల్‌కు ఫోన్ చేస్తే ఆయ‌న రెడీ అన్నారు. అక్క‌డ నుంచి సాయి ముందుండి సినిమాను న‌డిపించాడు. హెచ్‌బీఓ చానెల్ చూసి అదే స్ఫూర్తితో డీబీఓ (దండ‌మూడి బాక్సాఫీస్‌) పెట్టాను. ఇది చాలా పెద్ద ఇండ‌స్ట్రీ. చాలా కొత్త విష‌యాల‌ను నేర్చుకున్నాను. ఇందులో వ్యాపారం చేయ‌టం అంత సుల‌భం కాదు. ఇక్క‌డకు రావాలంటే ప్యాష‌న్ ఉండాలి. లాభ‌న‌ష్టాలు గురించి ఆలోచించ‌కుండా ఉంటేనే మంచి సినిమాలు చేయ‌గ‌లుగుతాం. ఎవ‌రైనా ఈ రంగంలోకి రావాల‌నుకుంటే ప్యాష‌న్ ఉండాలి. సినిమా చాలా మంచి స‌క్సెస్ కావాలి. భవిష్యత్తులోనూ న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ సినిమాలు చేస్తాం’’ అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ గొట్టిపాటి సాయి మాట్లాడుతూ ‘‘నేను ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి 30 ఏళ్లు అయ్యాయి. 80కిపైగా సినిమాలు చేశాను. అవ‌నీంద్ర కుమార్‌గారు సినిమా చేయాల‌ని రెడీ అవ‌గానే నాకు విష‌యం చెప్పారు. డ‌బ్బులు విష‌యంలో అంత క‌చ్చితంగా ఉంటారు. అవ‌నీంద్ర‌గారైతే క‌రోనా మందులు త‌యారు చేసి ఉచితంగా పంచారు. ఆయ‌న జీవితంలో ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని ఈ స్థాయికి వ‌చ్చారు. ఇప్పుడు సినీ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చారు. ఆయ‌న‌కు ప్ర‌జ‌ల ఆశీర్వాదం ఉండాలి. ప్యాష‌నేట్ ఉంటేనే ఇండ‌స్ట్రీలో ఉండాలి. చిన్న నిర్మాత‌లు జాగ్ర‌త్త‌గా ఉండాలి. మార్చి 24న సినిమా రిలీజ్ అవుతుంది. అంద‌రూ సినిమాను థియేట‌ర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు కృష్ణ చైత‌న్య మాట్లాడుతూ ‘‘‘కథ వెనుక కథ’ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చిన మా నిర్మాత అవ‌నీంద్ర కుమార్‌గారికి స్పెష‌ల్ థాంక్స్‌. హీరో విశ్వంత్‌కి థాంక్స్‌. ఈ సినిమా అవ‌కాశం రావ‌టానికి ప్ర‌ధాన కార‌ణం నా స్నేహితుడు సాయి. ఇది చాలా బ‌ల‌మైన క‌థ‌. స‌పోర్ట్ చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్‌కి థాంక్స్‌. అలాగే మా మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్ర‌వ‌ణ భ‌ర‌ద్వాజ్‌కి థాంక్స్‌. నాకు స‌పోర్ట్ చేసిన మా డైరెక్ష‌న్ టీమ్‌కి కృత‌జ్ఞ‌త‌లు’’ అన్నారు.

న‌టుడు అలీ మాట్లాడుతూ ‘‘నిర్మాత అవ‌నీంద్ర కుమార్‌గారు చాలా మంచి మ‌న‌సున్న వ్య‌క్తి. ఆయ‌న‌కు సినిమాలు తీసి లాభాల‌ను సంపాదించాల‌నే ఉద్దేశం లేదు. ఓ కొత్త ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేస్తే.. త‌ను భ‌విష్య‌త్తులో పెద్ద ద‌ర్శ‌కుడు అయితే ప‌ది మందికి ఉప‌యోగ‌ప‌డ‌తాడనేదే ఆయ‌న ఆలోచ‌న‌. సినిమాలో లాభాలు వ‌చ్చినా ఆయ‌న త‌న ద‌గ్గ‌ర ఉంచుకోడు. అంద‌రికీ పంచేస్తాడు. అలాగే గొట్టిపాటి సాయి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి 30 ఏళ్లు అయ్యింది. ఈ సినిమాకు స‌హ నిర్మాత‌గా ప‌ని చేశాడు. ఇలాంటి నిర్మాత ఉంటే, ఆయ‌న చేసే మూవీస్‌ హిట్ అయితే అంద‌రూ బావుంటారు. నిర్మాత‌లు బావుంటేనే ఇండ‌స్ట్రీ బావుంటుంది. ఇలాంటి టీమ్‌కు ప్రేక్ష‌కుల ఆశీర్వాదం ఎంతో ముఖ్యం. మార్చి 24న రిలీజ్ అవుతున్న ‘కథ వెనుక కథ’ టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు.

న‌టుడు సునీల్ మాట్లాడుతూ ‘‘‘కథ వెనుక కథ’ చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టానికి చేసే సినిమాలో అంద‌రికీ ముందుగా, అండ‌గా నిల‌బ‌డేది నిర్మాత‌గారే. అలా అండ‌గా నిల‌బ‌డిన వ్య‌క్తి అవ‌నీంద్ర కుమార్‌గారు. ఇలాంటి నిర్మాత దొర‌క‌టం చాలా అదృష్టం. కృష్ణ చైత‌న్య‌కు అవ‌నీంద్ర కుమార్‌గారి వంటి నిర్మాత దొరికారు. కృష్ణ చైత‌న్య చాలా మంచి క‌థ‌తో ఈ సినిమాను చేశాడు. మంచి నిర్మాత‌ను ఇండ‌స్ట్రీకి తీసుకొచ్చిన సాయిగారికి థాంక్స్‌. విశ్వంత్ చాలా మంచి న‌టుడు, బాయ్ నెక్ట్స్ డోర్‌లా అనిపిస్తాడు. ఫ్యూచ‌ర్‌లో మంచి హీరో అవుతాడు. త‌న‌కు, హీరోయిన్స్ స‌హా అంద‌రికీ అభినంద‌న‌లు. మార్చి 24న మూవీ రిలీజ్ అవుతుంది. ఇలాంటి క్యారెక్ట‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌లేదు. చాలా మంచి పాత్ర‌లో న‌టించాను. ఇంత మంచి రోల్ ఇచ్చిన కృష్ణ చైత‌న్య‌గారికి థాంక్స్‌. శ్ర‌వ‌ణ్‌ భ‌ర‌ద్వాజ్ చాలా మంచి సంగీతాన్ని అందించారు. త‌న‌కు అభినంద‌న‌లు. అలీగారు ఓ సాంగ్‌లో నటించారు. మార్చి 24న సినిమా రిలీజ్ అవుతుంది. సినిమాను చూసి పెద్ద స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్ మాట్లాడుతూ ‘‘నేను లవ్ సినిమాలకు మంచి మ్యూజిక్ ఇస్తానని అందరూ అనుకుంటారు. కానీ నేను ఇలాంటి డిఫ‌రెంట్ సినిమాల‌కు కూడా మ్యూజిక్ ఇస్తాన‌ని తెలుసు. అలాంటి వారిలో డైరెక్ట‌ర్ కృష్ణ చైత‌న్య ఒక‌రు. నిర్మాత అవ‌నీంద్ర‌గారు, సాయిగారు నాకెంతో ఫ్రీడ‌మ్ ఇచ్చి వ‌ర్క్ చేయించుకున్నారు. రెండు పాట‌ల‌కు సంగీతం అందించారు. పూర్ణాచారి మంచి సాహిత్యాన్ని అందించారు. అంద‌రికీ న‌చ్చుతుంది. మార్చి 24న సినిమాను అంద‌రూ థియేట‌ర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ కృష్ణ చైత‌న్య‌కు థాంక్స్‌. ఓ సాంగ్ చేసే అవ‌కాశం ఇచ్చారు. నిర్మాత అవ‌నీంద్ర కుమార్‌గారికి స్పెష‌ల్ థాంక్స్‌. ఆయ‌న వ్యాపార‌వేత్త, నిర్మాతే కాదు.. మంచి మ‌న‌సున్న వ్య‌క్తి. ప్రివ్యూ షో చూశాను. విశ్వంత్ స‌హా అంద‌ర‌రూ అద్భుతంగా చేశారు. అన్ని చ‌క్క‌గా కుదిరాయి. సునీల్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని పాత్ర‌లో న‌టించారు. సాయిగారు స‌హా అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.

లిరిక్ రైట‌ర్ పూర్ణాచారి మాట్లాడుతూ ‘‘సినిమాలో రెండు పాటలు రాసే అవకాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌. శ్ర‌వ‌ణ్‌గారు అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు’’ అన్నారు.

నటుడు మధునందన్ మాట్లాడుతూ ‘‘నిర్మాత అవనీంద్ర కుమార్‌గారు పెద్ద స్కేల్ సినిమాను చేయ‌ట‌మే కాదు.. ప్ర‌మోష‌న్స్ కూడా అదే రేంజ్‌లో చేస్తున్నారు. ప్యాష‌నేట్ ప్రొడ్యూస‌ర్‌. ఆయ‌న నిర్మించిన ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. మార్చి 24న రిలీజ్ అవుతున్న ‘కథ వెనుక కథ’ సినిమా కొత్త‌గా ఉంటుంది. ఎంట‌ర్టైన్ అవుతారు’’ అన్నారు.

హీరోయిన్ శ్రీజిత గౌస్ మాట్లాడుతూ ‘‘తెలుగు సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ‘కథ వెనుక కథ’ డిఫ‌రెంట్ క‌థ‌. విశ్వంత్ అమేజింగ్ కో యాక్ట‌ర్‌. అంద‌రూ నాకు బాగా స‌పోర్ట్ చేశారు. శ్ర‌వ‌ణ్‌గారు మంచి సంగీతాన్ని అందించారు. నిర్మాత అవ‌నీంద్ర‌కుమార్‌గారికి, ద‌ర్శ‌కుడు కృష్ణ చైత‌న్యకు థాంక్స్‌’’ అన్నారు.

హీరోయిన్ శుభశ్రీ మాట్లాడుతూ ‘‘మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన కృష్ణ‌చైత‌న్య‌గారు, సాయిగారికి, నిర్మాత అవ‌నీంద్ర కుమార్‌గారికి థాంక్స్‌. విశ్వంత్, శ్రీజిత‌, సునీల్‌గారు, అలీగారు స‌హా అంద‌రికీ థాంక్స్’’ అన్నారు.

న‌టీన‌టులు:

విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభ శ్రీ, అలీ, సునీల్‌, జ‌య ప్ర‌కాష్‌, బెన‌ర్జీ, ర‌ఘు బాబు, స‌త్యం రాజేష్‌, మ‌ధు నంద‌న్‌, భూపాల్‌, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, ఖ‌య్యుం, ఈరోజుల్లో సాయి, రూప త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్‌:  దండ‌మూడి బాక్సాఫీస్‌
నిర్మాత‌:  అవ‌నీంద్ర కుమార్‌
స్టోరి, డైలాగ్స్‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  కృష్ణ చైత‌న్య‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  సాయి గొట్టిపాటి
సినిమాటోగ్రాఫ‌ర్స్‌:  గంగ‌న‌మోని శేఖ‌ర్‌, ఈశ్వ‌ర్‌
ఎడిట‌ర్‌: అమ‌ర్ రెడ్డి కుడుముల‌
మ్యూజిక్‌:  శ్ర‌వ‌ణ్ భ‌రద్వాజ్‌
ఫైట్స్: అంజి, రియ‌ల్ స‌తీష్‌
ఆర్ట్‌:  వెంక‌ట్ స‌ల‌పు
కొరియోగ్ర‌ఫీ:  భాను
లిరిక్స్‌:  కాస‌ర్ల శ్యామ్, పూర్ణాచారి
ఆడియో:  ఆదిత్య మ్యూజిక్‌
పి.ఆర్.ఒ:  నాయుడు సురేంద్ర కుమార్ – ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

2 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

7 days ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

7 days ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago