కార్తి ప్రిన్స్ పిక్చర్స్ ‘సర్దార్’ ట్రైలర్ విడుదల

హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్‌ ల తాజా చిత్రం ‘సర్దార్’ బ్రిలియంట్ టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. నిర్మాతలు తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసారు.కార్తిని మారువేషంలో సర్దార్‌గా, పబ్లిసిటీ క్రేజ్ వున్న ఇన్‌స్పెక్టర్ విజయ్ ప్రకాష్‌గా ద్విపాత్రాభినయంలో పరిచయం చేస్తూ ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. సైనిక సమాచారాన్ని ఉన్న ఒక సీక్రెట్ ఫైల్ మిస్ అవుతుంది. రా (RAW) సిబిఐతో సహా ప్రతి ఒక్కరూ దాని కోసమే వెదుకుతుంటారు. చివరిగా అది ఎవరికీ చిక్కింది, అందులో వున్న రహస్యాలు ఏమిటనేది ఇందులో కధాంశంగా ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది.

పిఎస్ మిత్రన్ అద్భుత కథనం, డివోపీ  జార్జ్ సి విలియమ్స్ బ్రిలియంట్ విజువల్స్, జివి ప్రకాష్ కుమార్ అవుట్ స్టాండింగ్ లైవ్ స్కోర్‌తో ట్రైలర్  ఆద్యంతం ఆకట్టుకుంది. కార్తి పాత్ర, అభినయం ఎక్స్ టార్డినరీగా వుంది. విభిన్న షేడ్స్ ఉన్న పాత్రను అద్భుతంగా పోషించాడు. రాశి ఖన్నా, రజిషా విజయన్, లైలా కూడా ట్రైలర్‌లో కనిపించి అంచనాలు పెంచారు.ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌ లక్ష్మణ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనుంది.దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలౌతుంది.

తారాగణం: కార్తీ, రాశి ఖన్నా, చుంకీ పాండే, రజిషా విజయన్, లైలా, మునిష్కాంత్, అశ్విన్, యోగ్ జాపి, నిమ్మి, బాలాజీ శక్తివేల్, ఎలవరసు  తదితరులు

సాంకేతిక  విభాగం:
దర్శకత్వం: పిఎస్ మిత్రన్
నిర్మాత: ఎస్ లక్ష్మణ్ కుమార్
బ్యానర్లు: ప్రిన్స్ పిక్చర్స్, అన్నపూర్ణ స్టూడియోస్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: జార్జ్ సి విలియమ్స్
ఎడిటర్: రూబెన్
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
ఆర్ట్: కతీర్

Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

7 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago