కార్తీ మాగ్నమ్ ఓపస్ #కార్తీ29 అనౌన్స్ మెంట్

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ధీరన్ అధిగారం ఒండ్రు, అరువి, ఖైదీ, ఒకే ఒక జీవితం, ఫర్హానా వంటి ప్రతిష్టాత్మక సినిమాలతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అద్భుతమైన కథలతో, ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్న హీరో కార్తి. ఇప్పుడు, కార్తీ, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ #కార్తీ 29కి డైరెక్టర్ చేయడానికి కి టాలెంటెడ్ డైరెక్టర్ తమిళ్‌ని ఎంచుకున్నారు. ఈ పీరియాడికల్ ఫిల్మ్ భారీ స్థాయిలో తెరకెక్కనుంది. విమర్శకుల ప్రశంసలు పొందిన తానాఅక్కరన్‌తో మూవీతో తమిళ్ అందరినీ ఆకట్టుకున్నారు.  

ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నేతృత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్, కార్తీ కలిసి తీరన్ అధిగారం ఒండ్రు, ఖైదీ, సుల్తాన్ వంటి క్లాసిక్ బ్లాక్‌బస్టర్‌లను అందించడంతో పాటు కాష్మోరా, జపాన్ వంటి ప్రయోగాత్మక చిత్రాలతో అలరించారు. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

మాగ్నమ్ ఓపస్  #కార్తీ29ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌తో పాటు, ఇషాన్ సక్సేనా, సునీల్ షా,  రాజా సుబ్రమణియన్ నేతృత్వంలోని ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్, B4U మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తాయి.

ఈ సినిమాను 2025లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. #కార్తీ29  ఇతర తారాగణం, టెక్నికల్ టీం అప్‌డేట్‌లను ప్రొడక్షన్ హౌస్ త్వరలో తెలియజేస్తుంది.

తారాగణం: కార్తీ
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: తమిళ్
నిర్మాతలు: SR ప్రకాష్ బాబు, SR ప్రభు, ఇషాన్ సక్సేనా, సునీల్ షా , రాజా సుబ్రమణియన్
బ్యానర్లు: డ్రీమ్ వారియర్ పిక్చర్స్, ఐవీ ఎంటర్టైన్మెంట్, B4U మోషన్ పిక్చర్స్
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “చిరంజీవి” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా "చిరంజీవి". ఈ చిత్రంలో తనికెళ్ల భరణి,ఈశ్వరీ రావు, గోపరాజు రమణ,శ్రీకాంత్…

8 hours ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 day ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

5 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

5 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago