”కరాళ” చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్

హెహ్ ఎమ్ మూవీ మేకర్స్ పతాకం పై రవి శంకర్, జెడి ఆకాష్, సయెద్ ఇర్ఫాన్, సుమితా బజాజ్, సహర్ అఫ్సహ, వీరు ప్రధాన పాత్రలో హెహ్ ఎమ్ శ్రీనందన్ దర్శకత్వం వహించగా బోదాసు నర్సింహా నిర్మించిన చిత్రం “కరాళ” (Karala). ఈ చిత్రం విడుదలకు సిద్ధం గా ఉంది. ఈ చిత్రం కన్నడంలో ‘బీగా’ (Beega) పేరుతో విడుదల అవుతుంది. కరాళ చిత్రానికి సంభందించిన థియేట్రికల్ ట్రైలర్ ను పాత్రికేయుల సమావేశంలో విడుదల చేసారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా నిర్మాత ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రత్నావళి కొత్తపల్లి, శ్రీహరి, ధనుంజయ్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, గజవెల్ నర్సింహా తదితరులు విచ్చేసారు.

అనంతరం తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ “ఒక మంచి సినిమా ని ఎంకరేజ్ చేసే ఆ సినిమా బ్రతుకుతుంది. ఈ చిత్రం శ్రీ లక్ష్మి పిక్చర్స్ అధినేత బాపిరాజు గారు విడుదల చేస్తున్నారు. అయన చాలా గ్రాండ్ గా చిత్రాన్ని విడుదల చేస్తారు. కన్నడ నుంచి వచ్చిన చిత్రాలు అని విజయవంతం అయ్యాయి. ఈ చిత్రం తెలుగు కన్నడ భాషల్లో విడుదల అవుతుంది. మంచి విజయం సాదించాలి” అని కోరుకున్నారు.

ప్రసన్న కుమార్ మాట్లాడుతూ “దర్శకుడు సాగర్ గారి శిస్యుడు శ్రీనందన్. కరాళ తెలుగు కన్నడ లో విడుదల అవుతుంది. హీరో రవి శంకర్ ఉంటె సినిమా చాలా గ్రాండ్ గా ఉంటుంది. మంచి హిట్ అవాలి” అని కోరుకున్నారు.

జబర్దస్త్ యాక్టర్ నవీన్ మాట్లాడుతూ “నేను ఈ చిత్రం లో మంచి క్యారెక్టర్ వేసాను. ఫస్ట్ టైమ్ కన్నడ చిత్రంలో నటించాను. నా క్యారెక్టర్ బాగా వచ్చింది. ట్రైలర్ బాగుంది. ఏ చిత్రం మంచి విజయం సాదించాలి” అని కోరుకున్నారు.

నిర్మాత బోదాసు నర్సింహా మాట్లాడుతూ “నేను పిలవగానే వచ్చిన నా మిత్రులు శ్రీహరి, ధనుంజయ్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, గజవెల్ నర్సింహా అందరికి నా ధన్యవాదాలు. నాకు సినిమా అంటే తెలీదు, దర్శకుడు శ్రీనందన్ మంచి కథ చెప్పాడు, బాగా నచ్చింది, వెంటనే ప్రొడ్యూస్ సిద్ధం అని అనుకున్న. నా మిత్రుడు పిట్ల భాస్కర్ సహా నిర్మాతగా నాకు చాలా హెల్ప్ చేసాడు. మా కరాళ చిత్రం చాలా గొప్పగా వచ్చింది. తెలుగు కన్నడ లో విడుదల చేస్తున్నాం. అందరికి నచ్చుతుంది” అని ఆశించారు.

సహా నిర్మాత పిట్ల భాస్కర్ మాట్లాడుతూ “కరాళ చిత్రం బాగా నచ్చింది. నేను కో ప్రొడ్యూసర్ గా జాయిన్ అయ్యాను, సినిమా చూసాను, చాలా కొత్తగా మంచి సస్పెన్స్ తో ఉంటుంది. అందరికి బాగా నచ్చుతుంది” అని తెలిపారు.

సంగీత దర్శకుడు శ్రీ గురు మాట్లాడుతూ “ఈ చిత్రం లో మూడు పాటలు ఉన్నాయి. చాలా కొత్తగా ఉంటుంది. మంచి మ్యూజిక్ వచ్చింది., అందరికి ఈ సినిమా నచ్చితుంది” అని ఆశించారు.

నటుడు జెడి ఆకాష్ మాట్లాడుతూ “నా ఈ అవకాశం ఇచ్చిన నా దర్శకుడు నిర్మతల కి ధన్యవాదాలు. కరాళ చిత్రం చాలా డిఫరెంట్ కథ, లవ్ సైన్స్ మిస్టరీ ఈ మూడు అంశాలు కలిసి ఉన్న కథ. షూటింగ్ చాలా బాగా జరిగింది. త్వరలో విడుదల అవుతుంది. నేను కన్నడ లో కొని సినిమాలు చేశాను కానీ తెలుగు లో ఇది నా మొదటి సినిమా. మీకు అందరికి నచ్చుతుంది అని ఆశిస్తున్నాను.

దర్శకుడు శ్రీనందన్ మాట్లాడుతూ “కరాళ చిత్రం సైంటిఫిక్ మిస్టరీ చిత్రం. చాలా ఇంటరెస్టింగ్ గా మంచి ట్విస్ట్స్ తో మంచి సంగీతం తో మంచి యాక్షన్ సన్నివేశాలతో చాలా కొత్తగా ఉంటుంది. కన్నడ లో ‘బీగా’ పేరుతో మార్చ్ 3న విడుదల చేస్తున్నాం. తెలుగు లో త్వరలో విడుదల చేస్తున్నాం. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. అందరికి నచ్చుతుంది” అని తెలియజేసారు.

చిత్రం పేరు : కరాళ

బ్యానర్ : హెహ్ ఎమ్ మూవీ మేకర్స్

నటి నటులు : రవి శంకర్, జెడి ఆకాష్, సయెద్ ఇర్ఫాన్, సుమితా బజాజ్, సహర్ అఫ్సహ, వీరు, సుచంద్ర ప్రసాద్, సుమన్ శెట్టి, నవీన్ జబ్బర్దాస్త్, మహర్షి తదితరులు

నిర్మాత : బోదాసు నర్సింహా

దర్శకుడు : హెహ్ ఎమ్ శ్రీనందన్

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ గురు

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : సునీల్ కశ్యప్

కెమెరా మాన్ : ఎమ్ బి అల్లికట్టి, వీనస్ నాగరాజ్ మూర్తి
ఫైట్స్ : థ్రిల్లర్ మంజు, అల్టిమేట్ శివ
కొరియోగ్రాఫర్ : హరి కృష్ణ
ఎడిటర్ : వెంకీ
డైలాగ్స్ : జమదగ్ని మహర్షి
లిరిక్స్ : హెహ్ ఎమ్ శ్రీనందన్, సురేష్ గంగుల
సింగర్స్ : అరుణ్ కౌండిన్య, రితేష్, బృంద, భార్గవి పిళ్ళై

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago