టాలీవుడ్

అక్టోబర్ 15న రిలీజ్ కానున్న “కాంతారా” చిత్రం

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో వచ్చిన తొలి సినిమా పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘నిన్నిండలే’. దీనికి  జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత యశ్ తో ‘మాస్టర్ పీస్’ తీశారు. మూడో సినిమాగా పునీత్ తో తీసిన ‘రాజకుమార’ ఆ ఏడాది టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఆపై చరిత్ర మొదలైంది. యశ్, ప్రశాంత్ నీల్ తో ‘కెజిఎఫ్‌’ తీశారు. అది బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ‘కెజిఎఫ్‌2’ కి ముందు పునీత్ చివరి సినిమాగా విడుదలైన ‘యువరత్న’ ను నిర్మించింది కూడా హోంబలే ఫిల్మ్ సంస్థే. ఈ ఏడాది వచ్చిన ‘కెజిఎఫ్‌2’ ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించి వెయ్యి కోట్లకు పైగా పోగేయటం విశేషం. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సంస్థ తీస్తున్న సినిమాలలో ఎక్కువగా పాన్ ఇండియా రేంజ్ సినిమాలే ఉండటం గమనార్హం.

తాజాగా హోంబలే ఫిల్మ్స్, రిషబ్ షెట్టి కాంబినేషన్‌లో  వచ్చిన చిత్రం కాంతారా. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.కన్నడలో  సెప్టెంబర్ 30వ తేదీన  ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన ప్రతీ చోట భారీ రెస్పాన్స్‌ను అందుకుంది.ప్రస్తుతం ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకుని “గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్” ద్వారా “కాంతారా” సినిమాను రిలీజ్ చేయనున్నారు.”కాంతారా”  అంటే సంస్కృత భాషలో అడవి.

ప్రేమ చూపిస్తే అంతకు మించిన ప్రేమను.. విధ్వంసం సృష్టిస్తే.. అంతకంటే ఎక్కువ విధ్వంసాన్ని రిటర్న్ గిఫ్టుగా ఇవ్వడం అడవి తల్లి నైజం. ప్రేమ భావోద్వేగాలు, గ్రామీణ వాతావారాన్ని ఆహ్లదకరంగా చూపించిన ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ను అధికారికంగా రిలీజ్ చేశారు . అక్టోబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.రిషబ్ శెట్టి ఈ చిత్రానికి నటనే కాకుండా స్వయంగా దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించారు.అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లను అందించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.

దర్శకుడు – రిషబ్ శెట్టి
నిర్మాత – విజయ్ కిరగందూర్
నటీనటులు – రిషబ్ శెట్టి, కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమి
గౌడ, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమినాడు, మానసి సుధీర్, శనిల్ గురు, దీపక్
రాయ్ పనాజే
సినిమాటోగ్రాఫర్ – అరవింద్ ఎస్ కశ్యప్
ఎడిటర్ – ప్రతీక్ శెట్టి, కె ఎం ప్రకాష్
సంగీతం – అజనీష్ లోకనాథ్
పంపిణీ – గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

21 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

5 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

5 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago