భువనేశ్వరి పిక్చర్స్ కన్నడ- తెలుగు బైలింగ్వల్ మూవీ అనౌన్స్‌మెంట్

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ “హ్యాట్రిక్ హీరో”, కరుణడ చక్రవర్తి శివరాజ్ కుమార్ సౌత్ ఇండియాలో బిజియస్ట్ యాక్టర్స్ లో ఒకరు, లీడ్ రోల్స్ తో పాటు, జైలర్, కెప్టెన్ మిల్లర్. ఇతర ప్రముఖ చిత్రాలలో ప్రత్యేక పాత్రలు చేయడంలో శివన్న పాపులర్.

నిన్న శ్రీమతి గీతా శివ రాజ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా శివ రాజ్‌కుమార్ నెక్స్ట్ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ కన్నడ తెలుగు బైలింగ్వల్ ఫిల్మ్ ని  కార్తీక్ అద్వైత్ దర్శకత్వంలో పద్మజ ఫిలింస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో భువనేశ్వరి పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, సుధీర్ పి నిర్మిస్తున్నారు.

మేకర్స్ కొత్తగా విడుదల చేసిన పోస్టర్ ద్వారా శ్రీమతి గీతా శివ రాజ్‌కుమార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి, అనౌన్స్ మెంట్ కి పర్శనల్ టచ్ జోడించి, ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న ఎక్సయిట్మెంట్ ని పెంచడం ద్వారా మూవీని అనౌన్స్ చేశారు.

కార్తీక్ అద్వైత్ గతంలో విక్రమ్ ప్రభుతో ‘పాయుమ్ ఒలి నీ యెనక్కు’ తమిళ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌ ప్రాజెక్ట్‌తో శాండల్‌వుడ్‌లోకి అడుగుపెట్టారు, ఇది అతని సెకెండ్  డైరెక్షనల్ వెంచర్‌.

శివరాజ్ కుమార్‌ని కంప్లీట్ కొత్త లుక్, క్యారెక్టర్ లో ప్రజెంట్ చేసే ఈ మూవీపై అభిమానులలో భారీ అంచనాలు వున్నాయి. స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది, ఇప్పటికే మ్యూజిక్ కంపోజిషన్ జరుగుతోంది. అఫీషియల్ లాంచ్ వేడుక ఆగస్ట్‌లో వుంటుంది, షూట్‌ను ఫార్మల్ గా కిక్ స్టార్ట్ చేశారు.  

తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న నిర్మాత ఎస్ ఎన్ రెడ్డి ఈ బైలింగ్వల్ వెంచర్ కోసం సుధీర్ పి.తో కొలబరేట్ అవుతున్నారు. SN రెడ్డి రీసెంట్ ప్రాజెక్ట్ “జీబ్రా,” తెలుగు, కన్నడ రెండింటిలోనూ విడుదల కానుంది.

మిగిలిన ప్రధాన పాత్రల కోసం నటీనటుల ఎంపిక ఖరారైంది, శివరాజ్ కుమార్ నటనకు అనుగుణంగా ట్యాలెంటెడ్ స్టార్ కాస్ట్ వుంటుంది, అఫీషియల్ అనౌన్స్మెంట్స్ త్వరలో రిలీజ్ అవుతాయి. ఈ చిత్రం హై-బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. టాప్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎ.జె శెట్టి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎడిటింగ్ దీపు ఎస్ కుమార్, ఆర్ట్ డైరెక్టర్ రవి సంతే హక్లే.

ఈ కన్నడ – తెలుగు బైలింగ్వల్ ఫిల్మ్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

నటీనటులు: కరుణడ చక్రవర్తి శివరాజ్ కుమార్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: కార్తీక్ అద్వైత్
నిర్మాతలు: SN రెడ్డి,  సుధీర్ P
బ్యానర్: భువనేశ్వరి పిక్చర్స్
సమర్పణ: పద్మజ ఫిల్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.
సంగీతం: సామ్ సిఎస్
సినిమాటోగ్రఫీ: ఎ.జె. శెట్టి
ఎడిటర్: దీపు ఎస్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్: రవి సంతే హక్లే
పీఆర్వో: వంశీ శేఖర్

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago