టాలీవుడ్

14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్న కామాక్షి భాస్కర్ల

ప్రతిష్టాత్మకంగా న్యూ ఢిల్లీలో జరిగిన 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకోవటంపై హీరోయిన్ డా.కామాక్షి భాస్కర్ల సంతోషంగా ఉన్నారు. గత ఏడాది విడుదలై ఘన విజయం సాధించిన ‘మా ఊరి పొలిమేర 2’లో లక్ష్మీ అనే పాత్రలో ఆమె చూపించిన ఇన్‌టెన్స్ నటనకుగానూ ఆమెకు ఈ గుర్తింపు దక్కింది. ఈ సందర్భంగా కామాక్షి భాస్కర్ల ఇంతటి విజయాన్ని అందించిన తెలుగు సినీ ప్రేక్షకులకు, అవకాశం ఇచ్చిన చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలను తెలియజేశారు. అలాగే అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎంపిక కావటం విశేషం.

‘‘మా ఊరి పొలిమేర 2’ సినిమాలో నటనకుగానూ నాకు ఉత్తమ నటిగా అవార్డు రావటం నాకు థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన జ్యూరీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ అవార్డు నటిగా నా బాధ్యతను మరింతగా పెంచింది. ఈ సందర్భంగా సమహార థియేటర్ లో నాకు నటనను నేర్పించిన నా గురువుగారు రత్న శేఖర్‌గారికి, నీజర్ కబిగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాపై ఇంత ప్రేమాభిమానాలు చూపించిన ప్రేక్షకులకు థాంక్స్. నాకు సపోర్ట్ చేసి, ఈ అవార్డు రావటానికి కారణమైన ప్రతీ ఒక్కరికీ దీన్ని అంకితమిస్తున్నాను’’ అని పేర్కొన్నారు కామాక్షి భాస్కర్ల.

ఇదే సందర్భంలో ‘మా ఊరి పొలిమేర 2’లో తను చేసిన పాత్ర గురించి, సినిమా గురించి కామాక్షి మాట్లాడుతూ ‘‘సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం మాకుంది. అయితే అవార్డులు వస్తాయని మేం ఊహించలేదు. ఎంటైర్ టీమ్ ఇచ్చిన సపోర్ట్ తో సినిమా అవార్డులను సొంతం చేసుకుంది. ఓ టీమ్‌గా మేం ఇంత వరకు చేసిన ప్రయాణంతో పాటు ఇతర భాషా ప్రేమికులు సినిమా కంటెంట్‌ను ఎలా ఆదరిస్తున్నారో చూడటం ఆనందంగా ఉంది.

‘‘‘మా ఊరి పొలిమేర 2’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించటమే కాకుండా ప్రేక్షకుల, విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది. అందుకనే ఈ ప్రతిష్టాత్మక అవార్డు నా మనసులోప్రత్యేకంగా నిలిచిపోతుంది’’ అని పేర్కొంది కామాక్షి భాస్కర్ల.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

20 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

5 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

5 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago