మార్చి 17న ‘క‌బ్జ’ తెలుగు రిలీజ్

ఇండియ‌న్ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర హీరోగా న‌టిస్తోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘క‌బ్జ’. పాన్ ఇండియా  రేంజ్‌లో క‌న్న‌డ‌, తెలుగు, హిందీ, మ‌ల‌యాళ‌, త‌మిళ‌ భాష‌ల్లో ఈ చిత్రం మార్చి 17న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్  రిలీజ్ అవుతుంది. ఆర్‌.చంద్రు ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ప్ర‌ముఖ నిర్మాత ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి స‌మ‌ర్ప‌కుడిగా హీరో నితిన్ సొంత బ్యానర్స్ రుచిరా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఎన్ సినిమాస్ ప‌తాకాల‌పై తెలుగులో రిలీజ్ అవుతుంది. 

ఈ సంద‌ర్భంగా చిత్ర స‌మ‌ర్ప‌కుడు ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ  ‘‘క‌న్న‌డ చిత్రాలు కె.జి.య‌ఫ్‌, 777 చార్లి, విక్రాంత్ రోణ‌, కాంతార సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేష‌న్‌ను క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అంతే ఎగ్జ‌యిట్‌మెంట్‌ని క్రియేట్ చేసిన మ‌రో క‌న్న‌డ చిత్రం ‘కబ్జ’. తెలుగు ప్రేక్ష‌కులు ఎంత‌గానో అభిమానించే ఇండియ‌న్ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర ఈ చిత్రంలో హీరోగా న‌టించ‌టం విశేషం. ఈ సినిమాను తెలుగులో రుచిరా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఎన్ సినిమాస్ విడుద‌ల చేస్తుండ‌టం హ్య‌పీగా ఉంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌తో క‌బ్జ సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేష‌న్స్ క్రియేట్ అయ్యాయి. ఆర్‌.చంద్రుగారు ఒక్కో ఫ్రేమ్‌ను అద్భుతంగా తెర‌కెక్కించారు. త‌ప్పకుండా క‌బ్జ పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది’’ అన్నారు. 

 1947 నుంచి 1984 కాలంలో న‌డిచే క‌థ‌. స్వాతంత్య్ర స‌మ‌ర యోధుడు కొడుకు మాఫియా వ‌రల్డ్‌లో ఎలా చిక్కుకున్నాడు. త‌ర్వాత ఏ రేంజ్‌కు చేరుకున్నాడ‌నే క‌థాంశంతో క‌బ్జ‌ సినిమాను తెర‌కెక్కించారు. కె.జి.య‌ఫ్ ఫేమ్ ర‌వి బ‌స్రూర్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ చిత్రంలో భారీ తారాగ‌ణం న‌టిస్తున్నారు. శ్రియా శ‌ర‌న్‌, కిచ్చా సుదీప్‌, శివ రాజ్‌కుమార్‌, జ‌గ‌ప‌తి బాబు, ప్ర‌కాష్ రాజ్‌, సముద్ర‌ఖ‌ని, ముర‌ళీ శ‌ర్మ‌, న‌వాబ్ షా, క‌బీర్ దుహాన్ సిఒంగ్‌, ద‌నీష్ అక‌ర్త ష‌ఫి, ప్ర‌దీప్ సింగ్ రావ‌త్‌, కృష్ణ ముర‌ళి పోసాని, ప్ర‌మోద్ శెట్టి, అనూప్ రెవ‌న‌న్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు.

TFJA

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 hour ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago