సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన దీపావళి బ్లాక్ బస్టర్ మూవీ “K-ర్యాంప్”లో రాజశేఖర్ హీరోగా నటించిన ఆయుధం సినిమాలోని ఇదేటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా పాటను ఉపయోగించారు. హీరో ఇంట్రడక్షన్ సమయంలో ఉపయోగించిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంతోమంది ఈ పాట బిట్ కు రీల్స్, షార్ట్స్ చేశారు. ఇలా “K-ర్యాంప్” సక్సెస్ లో ఈ పాట కూడా ఒక భాగమైంది. ఈ నేపథ్యంలో ఆయుధం సినిమా హీరో రాజశేఖర్, నిర్మాతలు వజ్జా శ్రీనివాసరావు, ఎన్.అంజన్ బాబు, దర్శకుడు ఎన్ శంకర్, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ లకు థ్యాంక్స్ చెప్పారు “K-ర్యాంప్” నిర్మాతలు రాజేశ్ దండ, శివ బొమ్మకు

నిర్మాతలు రాజేశ్ దండ, శివ బొమ్మకు మాట్లాడుతూ – ఈ దీపావళికి మా “K-ర్యాంప్” సినిమాకు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా సినిమాలో డాక్టర్ రాజశేఖర్ గారు హీరోగా నటించిన ఆయుధం సినిమాలోని ఇదేటమ్మా మాయా మాయా పాటను పిక్ చేసుకున్నాం. ఇంతమంచి బ్లాక్ బస్టర్ సాంగ్ అందించారు వందేమాతరం శ్రీనివాస్ గారు. నిర్మాతలు వజ్జా శ్రీనివాసరావు, ఎన్.అంజన్ బాబు గారికి, ఇలాంటి బ్లాక్ బస్టర్ సాంగ్ అప్పట్లోనే సెలెక్ట్ చేసుకున్న మా డైరెక్టర్ ఎన్ శంకర్ గారికి థ్యాంక్స్. ఈ పాట మా సినిమాలో కూడా బాగా వైరల్ అయ్యి, ఎన్నో రీల్స్ వచ్చి మాకు ప్రమోషన్ పరంగా హెల్ప్ అయ్యింది. ఆయుధం టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.

