జోజు జార్జ్ “పని” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 13న రిలీజ్.

రీసెంట్ గా మలయాళంలో సూపర్ హిట్టయిన స్టార్ హీరో మరియు దర్శకుడు జోజు జార్జ్ సినిమా “పని” తెలుగులో ఈ నెల 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో అభినయ కీలక పాత్రలో నటించింది. ఆమ్ వర్డ్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. రాజవంశీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. పని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో

తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు డైరెక్టర్ వీరశంకర్ మాట్లాడుతూ – పని సినిమా మలయాళంలో రిలీజ్ మంచి విజయాన్ని సాధించింది. ఇదొక సెన్సబుల్ ఫిల్మ్. పని సినిమా తెలుగులోకి నా మిత్రుడు రాజ వంశీ తీసుకొస్తున్నారు. జోజు జార్జ్ మంచి నటుడు. ఆయన ఎన్నో అవార్డ్ లు అందుకున్నారు. తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. పని సినిమా తెలుగులోనూ ఘన విజయం సాధించాలి, రాజ వంశీతో పాటు టీమ్ అందరికీ సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.

తెలుగు ఫిలింఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ – మలయాళ సినిమా అంటే నాకు ప్రత్యేకమైన గౌరవం. వాళ్లు కంటెంట్ ను గౌరవిస్తారు. అందుకే మంచి విజయాలు సాధిస్తున్నారు. పని సినిమా కూడా అలాంటి స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తున్న మూవీ. ప్రేక్షకులు ఈ చిత్రానికి మంచి విజయాన్ని ఇస్తారని ఆశిస్తున్నా అన్నారు.

నటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ – రాజవంశీ నాకు మంచి మిత్రులు. జోజు జార్జ్ గారికి నేను అభిమానిని. ఆయన మూవీస్ ఓటీటీలో చూస్తుంటాను. ఎప్పుడెప్పుడు ఆయనను కలుస్తానా అనుకున్నాను. ఈ వేదిక మీద కుదిరింది. చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ తో కూడా ఆకట్టుకోగల నటుడు. అభినయ మనల్ని ఎన్నో సినిమాలతో ఆకట్టుకుంది. వీరు కలిసి నటించిన పని సినిమా తన పనితనం ఎంటో తెలుగు బాక్సాఫీస్ దగ్గర కూడా చూపించాలి అన్నారు.

మలయాళ ప్రొడ్యూసర్ సిజో వడక్కన్ మాట్లాడుతూ – పని చిత్రంతో జోజు జార్జ్, అభినయ వంటి మంచి ఆర్టిస్టులతో పనిచేసే అవకాశం కలిగింది. పని సినిమా మలయాళం, కన్నడ, తమిళంలో మంచి విజయం సాధించింది. తెలుగులోనూ అలాంటి విజయాన్నే సాధిస్తుందని కోరుకుంటున్నా అన్నారు.

నటి అభినయ మాట్లాడుతూ – పని చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది. ఇదొక ఎక్సలెంట్ ఫిల్మ్. జోజు జార్జ్ గారితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. నటుడిగానే కాదు దర్శకుడిగానూ జోజు జార్జ్ గారు తన ప్రతిభ చూపించారు. నాతో పాటు మా టీమ్ అందరికీ ఎన్నో మంచి మెమొరీస్ ఇచ్చిందీ సినిమా. తెలుగులో “పని” సినిమా పెద్ద విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నా అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజ వంశీ మాట్లాడుతూ – వర్క్ ఈజ్ గాడ్…మనం చేసే పని మనకు దేవుడు. పని సినిమాను తెలుగులోకి తీసుకొస్తుండటం సంతోషంగా ఉంది. ఇది మంచి థ్రిల్లర్ సినిమా. 2 గంటల పాటు ఆడియెన్స్ ను ఎంగేజ్ చేస్తుంది. ఈ చిత్రంలో జోజు జార్జ్ గారు నటిస్తూ అద్భుతంగా రూపొందించారు. ఇలాంటి సినిమా చేయాలంటే ధైర్యం ఉండాలి. నటుడిగా ఆయన గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయాను. ఈ సినిమా ఈ నెల 20న ఓటీటీలో రావడం లేదు. తెలుగులో థియేటర్స్ లో సక్సెస్ పుల్ గా రన్ కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఓటీటీలోకి వస్తుంది. మీరంతా పని చిత్రానికి మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నా అన్నారు.

హీరో, దర్శకుడు జోజు జార్జ్ మాట్లాడుతూ – ఈ రోజు మా పని సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన గెస్ట్ లు అందరికీ థ్యాంక్స్. వాళ్లు నా గురించి గొప్పగా మాట్లాడటం సంతోషంగా ఉంది. నా దృష్టిలో మంచి సినిమాకు భాషా హద్దులు లేవు. ఏ భాషలో ప్రేక్షకులైనా ఆదరిస్తారు. తెలుగు చిత్రాల్లో నటించి మీ ఆదరణ పొందాను. పని సినిమా కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్. మా టీమ్ లోని ప్రతి మెంబర్ తన వర్క్ ను అద్భుతంగా చేశారు. అభినయతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. పని మూవీ తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా నచ్చుతుంది. మీరంతా మా మూవీని ఆదరిస్తారని కోరుకుంటున్నా అన్నారు.

ఈ కార్యక్రమంలో పని సినిమాలో నటించిన నటీనటులు, ఇతర టెక్నీషియన్స్ పాల్గొన్నారు.

నటీనటులు – జోజు జార్జ్, అభినయ, సాగర్ సూర్య, జునైద్, అభయ హిరణ్మయి, సీమ, బాబీ కురియన్, తదితరులు

టెక్నికల్ టీమ్
బ్యానర్ – అప్పు పతు పప్పు ప్రొడక్షన్ హౌస్
డీవోపీ – వేణు ఐఎస్ సీ, జినో జార్జ్
ఎడిటర్ – మను ఆంటోనీ
మ్యూజిక్ – సామ్ సీఎస్, విష్ణు విజయ్
పీఆర్ఓ – చందు రమేష్
తెలుగు రిలీజ్ – ఆమ్ వర్డ్ ఎంటర్ టైన్ మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రాజ వంశీ
దర్శకత్వం – జోజు జార్జ్

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

1 hour ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

7 days ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

7 days ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago