సెప్టెంబర్ 7న ఆడియెన్స్ కి సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియెన్స్ ఇవ్వనున్న ‘జవాన్’.. ఆకట్టుకుంటోన్న ట్రైలర్

సెప్టెంబర్ 7న ఆడియెన్స్ కి సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియెన్స్ ఇవ్వనున్న ‘జవాన్’.. ఆకట్టుకుంటోన్న ట్రైలర్

ఎట్టకేలకు ఎన్నో రోజులుగా అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. వారి నిరీక్షణకు తెర పడింది. గురువారం షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘జవాన్’ ట్రైలర్ విడుదలైంది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ నటించిన చిత్రం ‘జవాన్’. అట్లీ దర్శకుడు. నయనతార ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా మెప్పించనున్నారు. ఈరోజు నయనతార ఇన్ స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టారు. ఇది ఆమె అభిమానులకు ఎంతో ఆనందకరమైన విషయం. అయితే ఆమె ముందుగా అందులో ‘జవాన్’ ట్రైలర్ ను పోస్ట్ చేయటం అందరినీ రెట్టింపు సంతోషాన్నిచ్చింది. శుక్రవారం నుంచి ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 7న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. 

రీసెంట్ టైమ్ లో ‘జవాన్ ప్రివ్యూ’ పేరుతో విడుదల చేసిన గ్లింప్స్ కు అమేజింగ్ రెస్పాన్స్ రావటంతో పాటు అందరికీ ఇదొక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనుభూతినిస్తుందని ఫిక్స్ అయ్యారు. సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు. సినిమాలోని సాంగ్స్, థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్సులు,షారూఖ్ ఖాన్ మాగ్నటిక్ పెర్ఫామెన్స్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచుతూ వచ్చాయి. ఈ క్రమంలో విడుదలైన జవాన్ ట్రైలర్ చూసిన అభిమానులు ఊర్రుతలూగుతున్నారు. అభిమానుల ఎక్స్ పెక్టేషన్స్ ను ఆకాశానికి చేర్చి నెట్టింట తెగ వైరల్ అవుతోందీ ట్రైలర్. 

గూజ్ బమ్స్ తెప్పించే యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్లింగ్ మూమెంట్స్ తో ‘జవాన్’ ట్రైలర్ ఫ్యాన్స్, ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లింది. మరో వారంలోనే సినిమా ఆడియెన్స్ ముందుకు రానుంది. దీంతో కౌంట్ డౌన్ మొదలైంది. ట్రైలర్ ను గమనిస్తే అందులోని విజువల్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పై సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందనిపిస్తోంది. సెప్టెంబర్ 7న వస్తోన్న జవాన్ సినిమా ఎవరూ ఉహించని రేంజ్ లో భారీగా ప్రేక్షకులు ముందుకు రానుంది. మరచిపోలేని థియేట్రిక్ ఎక్స్ పీరియెన్స్ ని అందించనుంది. 

షారూఖ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ‘జవాన్’ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌర‌వ్ వ‌ర్మ ఈ సినిమాకు స‌హ నిర్మాత‌. సెప్టెంబ‌ర్ 7న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ భాషల్లో రిలీజ్ అవుతుంది.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago