టాలీవుడ్

జ‌న‌తాబార్ థియేట్రిక‌ల్ ట్ర‌యిల‌ర్ ఆవిష్క‌రించిన హీరో శ్రీ‌కాంత్

ప్ర‌ముఖ క‌థానాయిక రాయ్ ల‌క్ష్మీ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తెలుగు చిత్రం జ‌న‌తాబార్‌. రోచిశ్రీ మూవీస్ ప‌తాక‌పంపై అశ్వ‌థ్‌ నారాయ‌ణ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మ‌ణ మొగిలి స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు శ‌క్తిక‌పూర్ ఇంపార్టెంట్ పాత్ర‌ను పోషిస్తున్నాడు. ఇటీవ‌ల ఈ చిత్రం ట్రైయిల‌ర్ హీరో శ్రీ‌కాంత్ విడుద‌ల చేశాడు. అన్ని ప‌నుల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మేలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ కుస్తీ పోటీల నేప‌థ్యంలో న‌డిచే క‌థ ఇది.

నేటి స‌మాజంలో స్త్రీ ప్రాధాన్య‌త‌ను చాటి చెప్పే చిత్ర‌మిది. నాలుగు పాట‌లు, ఫైట్స్‌ల‌తో కొన‌సాగే రెగ్యుల‌ర్ చిత్రం కాదు. క‌మ‌ర్షియాల్ అంశాలు వుంటూనే స‌మాజానికి చ‌క్క‌ని సందేశాన్ని మేళ‌వించి రూపొందించిన చిత్ర‌మిది అన్నారు. క‌థానాయిక ల‌క్ష్మీరాయ్ మాట్లాడుతూ తెలుగులో మంచి చిత్రం కోసం ఎదురుచూస్తున్న త‌రుణంలో ర‌మ‌ణ మొగిలి చెప్పిన ఈ క‌థ న‌న్ను ఎంతో ఆలోచింప‌జేసింది. ఒక‌వేళ ఈ చిత్రం చేయ‌క‌పోతే నా కెరీర్‌లో ఓ మంచి చిత్రాన్ని కోల్పోయేదాన్ని.

న‌న్ను నేను కొత్తగా ఆవిష్క‌రించుకోవ‌డానికి ఈ సినిమా ఎంతో ఉప‌యోగ‌ప‌డింది. ఈ చిత్రంలో నా పాత్ర బార్‌గ‌ర్ల్‌గా ప్రారంభ‌మై స‌మాజంలో మ‌హిళ‌లు గొప్ప‌గా చెప్పుకునే స్థాయికి ఎలా ఎదిగింది అనేది ఎంతో ఆస‌క్తిక‌రంగా వుంటుంది అన్నారు. యానిమ‌ల్ త‌రువాత ఈచిత్రంలో మ‌ళ్లీ ఓ మంచి పాత్ర‌ను చేశాన‌నిన, ఈ సినిమాలో త‌న పాత్ర న‌లుగురు చెప్పుకునేంత గొప్ప‌గా వుంటుంద‌ని శ‌క్తిక‌పూర్ తెలిపారు. ల‌క్ష్మీరాయ్‌, శ‌క్తిక‌పూర్‌, అనూప్‌సోని, ప్ర‌దీప్‌రావ‌త్‌, దీక్షాపంత్‌, అమ‌న్ ప్రీత్‌సింగ్, భోపాల్‌, విజ‌య్‌భాస్క‌ర్‌, మిర్చి మాధ‌వి త‌ద‌త‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ర‌చ‌యిత‌:


రాజేంద్ర భ‌ర‌ద్వాజ్‌, సంగీతం:
వినోద్ య‌జ‌మాన్య‌, డీఓపీ:
చిట్టిబాబు, ఫైట్స్‌: డ్రాగ‌న్ ప్ర‌కాష్‌, మ‌ల్లేశ్‌.అంజి, ఎడిటర్‌: ఎస్‌.బీ.ఉద్ద‌వ్‌, కొరియోగ్ర‌ఫీ: అశోక్‌రాజా, సుచిత్ర చంద్ర‌బోస్‌,అజ‌య్‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌:
సిరాజ్‌,

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

13 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago