డెడ్లీ కాంబో కోసం గెట్ రెడీ. మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షనర్ ‘మిస్టర్ బచ్చన్’లో రెండు బిగ్ ఫోర్సస్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ క్రేజీ ప్రాజెక్ట్ ‘మిస్టర్ బచ్చన్’లో బిజిఎస్ట్ యాక్టర్స్ లో ఒకరైన జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
అనౌన్స్ మెంట్ పోస్టర్ లో జగపతి బాబు ఇంటెన్స్, ఫెరోషియస్ లుక్ లో కనిపించారు. చెస్ మూవ్ ని చేతిలో పట్టుకొని సీరియస్ గా చూస్తున్న లుక్ అదిరిపోయింది. ‘మిస్టర్ బచ్చన్’ లో జగపతి బాబు పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని ఈ పోస్టర్ ద్వారా తెలుస్తుంది. దర్శకుడు హరీష్ శంకర్, జగపతి బాబు పాత్రని పవర్ ప్యాక్డ్ గా ప్రజెంట్ చేస్తున్నారు.
రవితేజ, జగపతిబాబులను తెరపై చూడటం కనుల పండువగా ఉంటుంది. ఇద్దరికీ పవర్ ఫుల్ క్యారెక్టర్స్ రాసుకున్నారు హరీష్ శంకర్. రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది.
టీమ్ 50 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు దాదాపు 80% ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రం ‘నామ్ తో సునా హోగా’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోంది. దీనికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా, అయనంక బోస్ కెమెరా డీవోపీగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.
తారాగణం: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సమర్పణ: పనోరమా స్టూడియోస్ & T-సిరీస్
సంగీతం: మిక్కీ జె మేయర్
డీవోపీ: అయనంక బోస్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
మేకప్ చీఫ్: ఐ శ్రీనివాసరాజు
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…