అక్టోబర్ మొదటి వారంలో జె.డి. చక్రవర్తి ‘హు’

జెడి చక్రవర్తి, శుభ రక్ష, నిత్య హీరో హీరోయిన్స్‌గా తెరకెక్కిన చిత్రం ‘హూ’. ఇటీవలే ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. తాజాగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘హు’ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రెడ్డమ్మ కె. బాలాజీ మాట్లాడుతూ… జెడి చక్రవర్తి స్వీయ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపుదిద్దుకున్న ఎమోషనల్‌ థ్రిల్లర్‌ మూవీ’ హూ’. ఇందులో యాక్షన్‌ సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచే రీతిలో చిత్రీకరించాం. అలాగే అనేక థ్రిల్లింగ్‌ అంశాలు కూడా ఉన్నాయి.

క్లాస్‌, మాస్‌ ప్రేక్షకులను అందరినీ అలరించేలా కంటెంట్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. ఇటీవలే పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. అక్టోబర్‌ తొలి వారంలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

జెడి చక్రవర్తి, శుభ, నిత్య, వినయ్‌ ప్రసాద్‌, విజయ్‌ చందర్‌, సునీల్‌ పూర్ణిక్‌, రమేష్‌ పండిట్‌, హర్షిత, ఉగ్రం రవి, శరణ్య, సనత్‌, నాగేంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఈశ్వర్‌ చంద్‌, ఎడిటింగ్‌: జెడి చక్రవర్తి, కెమెరా: ఎం.బి. అల్లికట్టి, విజువల్‌ ఎఫెక్ట్స్‌: చందు, పి.ఆర్‌.ఓ: బీ.వీరబాబు, ప్రొడ్యూసర్‌: రెడ్డమ్మ కే బాలాజీ, దర్శకత్వం: జేడీ చక్రవర్తి.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago