ఘనంగా “ఇట్లు… మీ సినిమా” ట్రైలర్ లాంఛ్ మరియు ప్రీ-రిలీజ్ ఈవెంట్

లిటిల్ బేబీస్ క్రియేషన్స్ పతాకంపై నోరి నాగ ప్రసాద్ నిర్మాతగా, దర్శకుడు హరీష్ చావా రూపొందిస్తున్న చిత్రం “ఇట్లు… మీ సినిమా”. అభిరామ్, వెన్నెల, మనోహర్, పవన్, కృష్ణ, మంజుల హీరో హీరోయిన్లుగా, ప్రదీప్, అమ్మ రమేష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. నలుగురు యువకులు తమకున్న ప్యాషన్ తో, సినిమా రంగానికి వచ్చి వాళ్లు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి, వాళ్ళు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారా లేదా అనే కథాంశంతో లవ్, రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్ కలగలిసి ఈ చిత్రాన్ని రూపొందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ఇట్లు… మీ సినిమా” ఈనెల 21న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా  ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో

దర్శక నిర్మాత నాగబాల సురేష్ మాట్లాడుతూ – రెండు దశాబ్దాలుగా పైగా ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసిన బాలరాజు “ఇట్లు… మీ సినిమా” మూవీతో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా మారడం సంతోషంగా ఉంది. మంచి సినిమాకు చిన్నా పెద్దా తేడా లేదు. “ఇట్లు… మీ సినిమా” మూవీ విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ – “ఇట్లు… మీ సినిమా” కంటెంట్ చాలా బాగుంది. డైలాగ్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. మంచి క్వాలిటీతో సినిమాను రూపొందించారు. ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను అన్నారు.

దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ – “ఇట్లు… మీ సినిమా” దర్శకుడు హరీష్ చావా ప్రతిభావంతుడు. సినిమాను బాగా రూపొందించాడు. మేము ఏమాత్రం టైమ్ ఉన్నా చిన్న సినిమాకు సపోర్ట్ చేసేందుకు వస్తుంటాము. ఇవాళ ఈ సినిమాను బ్లెస్ చేసేందుకు ఇంతమంది శ్రేయాభిలాషులు ఈవెంట్ కు రావడం సంతోషంగా ఉంది. ఈ మధ్యకాలంలో ఇంత భారీ సంఖ్యలో వీక్షకులు హాజరైన ప్రెస్ మీట్ ఇదే అనుకుంటా. అన్నారు.

నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ- కొత్త ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ ఫిలింమేకింగ్ మీద అవగాహన లేక నష్టపోతుంటారు. అలా వచ్చేవారు ఎవరైనా అనుభవం ఉన్నవారి సలహాలు తీసుకోండి. “ఇట్లు… మీ సినిమా” మూవీకి ఏ సపోర్ట్ కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. సినిమా బాగుంటే చిన్న చిత్రాలు కూడా పెద్ద విజయాలు సాధిస్తాయి. ఈ సినిమా కూడా అలాగే సక్సెస్ కావాలి. అన్నారు.

దర్శకుడు సముద్ర మాట్లాడుతూ – మన తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న సమయం ఇది. హరీష్ చావా లాంటి దర్శకుడు రాజమౌళి అంత పేరు తెచ్చుకోవాలి అన్నారు.

నిర్మాత టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ – “ఇట్లు… మీ సినిమా” అనే పేరులోనే ఇది మన సినిమా అనే అర్థం ఉంది. అంటే ఇండస్ట్రీలోని వాళ్ల అందరి సినిమా అనుకోవాలి. వైద్యుడిగా నోరి దత్తాత్రేయుడు గారు వరల్డ్ ఫేమస్, అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ నోరి నాగ ప్రసాద్ గుర్తింపు పొందాలి. దర్శకుడు హరీష్ చావా మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకోవాలని కోరుతున్నా అన్నారు.

 నిర్మాత  సాయివెంకట్ మాట్లాడుతూ.. ట్రైలర్, టీజర్ బాగున్నాయి. తప్పకుండా ఈ చిత్రం విజయం సాధిస్తుంది అన్నారు.

దర్శకుడు హరీష్ చావా మాట్లాడుతూ – “ఇట్లు… మీ సినిమా” రూపొందించే క్రమంలో మొదటి నుంచి నాకు సపోర్ట్ గా ఉన్నారు మా ప్రొడ్యూసర్ నోరి నాగప్రసాద్ గారు. ఎలాంటి సినిమా చేయాలని మేము డిస్కస్ చేస్తున్నప్పుడు నాగ ప్రసాద్ గారే ఏ కథో ఎందుకు మన కథే తీద్దాం. మనం సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేందుకు పడిన ఇబ్బందులతోనే సినిమా చేద్దాం అని అన్నారు. ఇలాంటి సినిమా చేస్తే సినిమా పరిశ్రమలోకి వచ్చేవారికి అవగాహన ఏర్పర్చినట్లు అవుతుందని అన్నారు. ఆయన సలహాతోనే “ఇట్లు… మీ సినిమా” మూవీ ప్రారంభించాం. చిత్ర పరిశ్రమలోకి రావాలనుకుంటున్న వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది మేము ఈ కథలో చూపించాం. ప్రేక్షకులందరికీ తప్పుకుండా నచ్చుతుంది. చిన్న సినిమా అని చూడకుండా థియేటర్స్ కు వెళ్లండి. మీ అందరూ అన్ని ఎమోషన్స్ ఉన్న “ఇట్లు… మీ సినిమా” మూవీని ఎంజాయ్ చేస్తారు. ఇవాళ మమ్మల్ని బ్లెస్ చేసేందుకు వచ్చిన అతిథులు, మా స్నేహితులందరికీ థ్యాంక్స్. అన్నారు.

నిర్మాత నోరి నాగ ప్రసాద్ మాట్లాడుతూ – మా “ఇట్లు… మీ సినిమా” మూవీ ట్రైలర్ లాంఛ్ కు అతిథులుగా వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి వచ్చిన స్నేహితులు, సన్నిహితులకు థ్యాంక్స్. ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్ గా ఆర్గనైజ్ చేసింది మా బాలరాజు అన్న. అతిరథ మహారథులు అందరినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చారు. మా మూవీకి శ్రీనివాస్, రామారావు అని ఇద్దరు మిత్రులు మాకెంతో సపోర్ట్ చేశారు. “ఇట్లు… మీ సినిమా” మూవీతో ఒక మంచి ప్రయత్నం చేశాం. చిత్ర పరిశ్రమలో కొత్త వాళ్లు పడే ఇబ్బందులను ఆసక్తికరంగా ప్రేక్షకులకు నచ్చేలా చూపించాం. అన్ని ఎమోషన్స్ కలిపిన చిత్రమిది. ఈ నెల 21న “ఇట్లు… మీ సినిమా” మూవీని థియేటర్స్ లోకి గ్రాండ్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం. మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నటి మంజుల మాట్లాడుతూ – “ఇట్లు… మీ సినిమా” మూవీలో మంచి క్యారెక్టర్ చేశాను. చాలా ఎమోషనల్ గా నా పాత్ర సాగుతుంటుంది. మీరు ట్రైలర్ లో నా క్యారెక్టర్ చూసే ఉంటారు. ఈ సినిమాలో అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ అన్నారు.

హీరోయిన్ వెన్నెల మాట్లాడుతూ – “ఇట్లు… మీ సినిమా” మూవీలో అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నా. ఒక మంచి మూవీలో భాగమవడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారికి థ్యాంక్స్. “ఇట్లు… మీ సినిమా” మూవీని థియేటర్స్ లో చూసి మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో అభిరామ్ మాట్లాడుతూ – “ఇట్లు… మీ సినిమా” మూవీలో అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ నోరి నాగప్రసాద్, దర్శకుడు హరీష్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా తీస్తున్న టైమ్ కంటే ఇప్పుడు స్లిమ్ గా మారాను. ఈ సినిమాలో కొత్త నటీనటులు అని చూడకండి. కేవలం కంటెంట్ చూసి మా మూవీ చూసేందుకు రమ్మని కోరు తున్నా అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇతర కాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ పాల్గొన్నారు.

నటీనటులు – అభిరామ్, వెన్నెల, మనోహర్, పవన్, కృష్ణ, మంజుల, ప్రదీప్, అమ్మ రమేష్ తదితరులు

టెక్నికల్ టీమ్ – డాన్స్: తాజ్, పి ఆర్ ఓ: చందు రమేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బూస్సా బాలరాజు, నిర్మాత: నోరి నాగ ప్రసాద్, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హరీష్ చావా.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

10 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago