వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో క్యూరియాసిటీని పెంచింది. ఈ సినిమా టీజర్, మెలోడీ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో అల్లరి నరేష్ గిరిజన ప్రాంతమైన మారేడుముల్లిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొకోని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా విడుదల కొంచెం ఆలస్యమౌతుంది.
నవంబర్ 11న కాకుండా 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్ లో గిరిజన ప్రాంతంలో పోలీసు అధికారులతో ప్రయాణిస్తూ విచారిస్తున్నట్లు కనిపించారు అల్లరి నరేష్.ఆనంది కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బాలాజీ గుత్తా సహనిర్మాత గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. రాంరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. అబ్బూరి రవి మాటలు అందించగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
తారాగణం: అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: ఎఆర్ మోహన్
నిర్మాత: రాజేష్ దండా
నిర్మాణం: జీ స్టూడియోస్, హాస్య మూవీస్
సహ నిర్మాత: బాలాజీ గుత్తా
సంగీతం: శ్రీచరణ్ పాకాల
డైలాగ్స్: అబ్బూరి రవి
డీవోపీ: రాంరెడ్డి
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
స్టంట్స్: పృథ్వీ
కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్, బిన్నీ
డిఐ – అన్నపూర్ణ స్టూడియోస్
పీఆర్వో: వంశీ-శేఖర్
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…