లిటిల్ బేబీస్ క్రియేషన్స్ పతాకంపై నోరి నాగ ప్రసాద్ నిర్మాతగా, హరీష్ చావా దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం “ఇట్లు… మీ సినిమా”. అభిరామ్, వెన్నెల, మనోహర్, పవన్, కృష్ణ, మంజుల హీరో హీరోయిన్లుగా, ఎఫ్2 ఫేమ్ ప్రదీప్, అమ్మ రమేష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇటీవల సీనియర్ దర్శకుడు కోదండరామి రెడ్డిగారి చేతులమీదుగా “ఇట్లు… మీ సినిమా” పోస్టర్ లాంచ్ చేశారు. నలుగురు యువకులు తమకున్న ఫ్యాషన్ తో, సినిమా రంగానికి వచ్చి వాళ్లు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి, వాళ్ళు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారా లేదా అన్నది కదాంశం. లవ్, రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్ కలగలసిన చిత్రం
“ఇట్లు… మీ సినిమా”. ప్రతి సినిమా వ్యక్తి ఇది నా కథ, అని ఫీలయ్యే లాగా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. మీరావలి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది అన్నారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రానికి డాన్స్: తాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బూస్సా బాలరాజు, నిర్మాత: నోరి నాగ ప్రసాద్, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హరీష్ చావా.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…