”సైంధవ్” నుంచి వికాస్ మాలిక్ గా నవాజుద్దీన్ సిద్ధిఖీ

విక్టరీ వెంకటేష్, శైలేష్ కొలను, వెంకట్ బోయనపల్లి, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘సైంధవ్’ నుంచి వికాస్ మాలిక్ గా నవాజుద్దీన్ సిద్ధిఖీ పరిచయం  

విక్టరీ వెంకటేష్ 75వ లాండ్ మార్క్ మూవీ ‘సైంధవ్’ కు టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హై-ఆక్టేన్ యాక్షన్‌ ఎంటర్ ట్రైనర్ రూపొందుతున్న ఈ చిత్రంలో  ప్రముఖ తారాగణం కనిపిస్తోంది. ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది.

బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. ఈ రోజు నవాజుద్దీన్ సిద్ధిఖీ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ చిత్రంలో ఆయన ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు మేకర్స్. వికాస్ మాలిక్ గా నవాజుద్దీన్ సిద్ధిఖీ ని పరిచయం చేశారు. ఒక కాస్ట్లీ కార్ పై కూర్చుని బీడీ తాగుతూ కనిపించారు. గెటప్ లో క్లాస్‌ గా కనిపిస్తూనే సినిమాలో డెడ్లీ విలన్‌ గా నటిస్తున్నారు.

మనోజ్ఞ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా, డాక్టర్ రేణు పాత్రలో రుహాని శర్మ, జాస్మిన్ పాత్రలో ఆండ్రియా జెర్మియా కనిపించనున్నారు.

ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్  గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత.

సైంధవ్ పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

తారాగణం: వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్‌, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా

సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం : శైలేష్ కొలను
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
బ్యానర్: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: సంతోష్ నారాయణ్
సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు
డీవోపీ: ఎస్.మణికందన్
ఎడిటర్: గ్యారీ బిహెచ్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
VFX సూపర్‌వైజర్: ప్రవీణ్ ఘంటా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం (వెంకట్)
పీఆర్వో : వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైనర్: అనిల్ & భాను
మార్కెటింగ్: CZONE డిజిటల్ నెట్‌వర్క్
డిజిటల్ ప్రమోషన్స్: హాష్‌ ట్యాగ్ మీడియా

Tfja Team

Recent Posts

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్ భేటీ: ‘పద్మశ్రీ’ వచ్చినందుకు ఘన సత్కారం

ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ…

19 hours ago

‘ఎర్రచీర’ ట్రైలర్ చాలా కొత్తగా ఉంది. ఫిబ్రవరి 6న నేను టికెట్ కొనుక్కుని సినిమా చూస్తా: మాజీ ఎంపీ మధు యాష్కి

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఎన్ వీ వీ…

19 hours ago

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్అమరావతి

ప్రముఖ సినీ నటులు, ‘నటకిరీటి’ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మంగళవారం సాయంత్రం (03/02/2026) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ…

19 hours ago

బరాబర్ బాధపడుతున్నాను!!

ఇటీవల తాను అతిధిగా పాల్గొన్న సినిమా ఫంక్షన్ లో జరిగిన దానికి బాధపడుతున్నానని తెలిపారు ప్రముఖ నటులు జె.డి.చక్రవర్తి. ఆయన…

19 hours ago

3 వేల ఎంట్రీలు, 100 మంది ఫైనలిస్టులు.. AVAA జర్నీకి శ్రీకారం చుట్టిన విష్ణు మంచు,హోస్ట్‌గా శివ బాలాజీ

సినిమా రంగాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే లక్ష్యంతో AVAA ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో AVAA ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ అధికారికంగా…

19 hours ago

టాలెంటెడ్ హీరో లెజెండ్ శరవణన్ “లీడర్” సినిమా గ్లింప్స్ రిలీజ్, ఏప్రిల్ లో గ్రాండ్ రిలీజ్ కు రాబోతున్న మూవీ

లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "లీడర్". ఈ చిత్రాన్ని లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్…

19 hours ago