సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రస్తుతం తన LCU నుండి వరుస బ్లాక్‌బస్టర్‌లతో అదరగొడుతున్న సెన్సేషనల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’సినిమా చేస్తున్నారు. ఇది రజినీకాంత్ కి 171 మూవీ. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా టైటిల్ రివీల్ టీజర్ కు మ్యాసీవ్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రంలో సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శృతి హాసన్, మహేంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరింత స్టార్ పవర్‌ను జోడించడానికి, మేకర్స్ కింగ్ నాగార్జునను ప్రత్యేక పాత్రలో పోషించినట్లు నాగార్జున పుట్టినరోజున అనౌన్స్ చేశారు. నాగార్జున ను సైమన్‌గా పరిచయం చేశారు, ఫస్ట్ లుక్ పోస్టర్ డైనమిక్ అవతార్‌ను ప్రజెంట్ చేస్తోంది. స్టైలిష్ షేడ్స్ మెరుస్తున్న గోల్డ్ వాచ్‌తో కనిపించిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది.
నాగార్జున చేరికతో స్టార్ పవర్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది. రజనీకాంత్, నాగార్జున అభిమానులకు ఇది గ్రేట్ ట్రీట్. నాగార్జున పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు గిరీష్ గంగాధరన్ కెమెరామ్యాన్ గా పని చేస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్. ఈ సినిమా 2025లో విడుదల కానుంది.
తారాగణం: రజనీకాంత్, నాగార్జున, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శృతి హాసన్, మహేంద్రన్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
నిర్మాత: కళానిధి మారన్
బ్యానర్: సన్ పిక్చర్స్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
డీవోపీ: గిరీష్ గంగాధరన్
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
పీఆర్వో: వంశీ-శేఖర్
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…